Jayasudha : జయసుధ మూడో పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 64 ఏళ్ల వయసులో ఆమె రహస్య వివాహం చేసుకున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. జయసుధ ఒక అజ్ఞాతవ్యక్తితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. పబ్లిక్, ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఆ మధ్య అలీ కూతురు వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు జయసుధ సదరు వ్యక్తితో పాటు వచ్చారు. అలాగే వారసుడు మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి సైతం జయసుధ ఆయనతో కలిసి హాజరయ్యారు. ఇక వారిద్దరి తీరు భార్యాభర్తలను తలపిస్తుంది.
కాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి జయసుధ హాజరయ్యారు. ఆమెతో పాటు జయప్రద, రాశి ఖన్నా పాల్గొన్నారు. బోల్డ్ క్వచ్చన్స్ కి ఆ షో పెట్టింది పేరు. అయినా జయసుధ పెళ్లి టాపిక్ రాలేదు. బాలయ్య ప్రస్తావన తేలేదు. దీంతో అందరి మదిలో ఆయన ఎవరు? జయసుధ పక్కనే ఎందుకు ఉంటున్నారు? ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటని? బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కారణం… ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు.
ఊహాగానాల ప్రకారం ఆయన ఒక బిజినెస్ మాన్. జయసుధను వివాహం చేసుకున్నారని అంటున్నారు. ఇక గతంలో జయసుధ రెండు వివాహాలు చేసుకున్నారు. యంగ్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న సమయంలో ఒక వ్యాపారవేత్తను పెళ్లాడారు. ఆయనతో ఆమెకు గిట్టలేదు. విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం 1985లో నిర్మాత నితిన్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి వివాహం ఘనంగా చేసింది.
2017లో నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్ కారణంగా నితిన్ కపూర్ సూసైడ్ చేసుకున్నాడని తేల్చారు. చాలా కాలంగా ఆయన భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నారు. జయసుధ హైదరాబాద్ లో ఉంటుంటే నితిన్ కపూర్ తన సిస్టర్ తో పాటు ముంబైలో ఉంటున్నారు. 18 ఏళ్ల నుండి ఆయనకు ఎలాంటి పనిలేదు. కుటుంబంతో దూరంగా ఉండటం కూడా డిప్రెషన్ కి కారణం కావచ్చు. ముంబైలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా జయసుధ మూడో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. నటిగా జయసుధ సుదీర్ఘ, సక్సెస్ఫుల్ కెరీర్ కలిగి ఉన్నారు.