Veerasimha Reddy Collections : ‘వాల్తేరు వీరయ్య’ మేనియాలో కొట్టుకుపోయిన ‘వీర సింహా రెడ్డి’..రెండోరోజు వచ్చిన వసూళ్లు ఇంతేనా!

Veerasimha Reddy Collections : ఈ సంక్రాంతి కి విడుదలవుతున్న సినిమాలలో గత కొద్దీ రోజుల క్రితం వరకు మంచి పోటీ ఉంటుందేమో అని అభిమానులతో పాటుగా ట్రేడ్ కూడా అనుకున్నారు..కానీ ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి అలా లేదు..వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారిపోయింది..నిన్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి వచ్చిన ఓపెనింగ్ చూసి బాలయ్య బాబు అఖండ తర్వాత మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని అందరూ అనుకున్నారు. […]

Written By: NARESH, Updated On : January 13, 2023 10:05 pm
Follow us on

Veerasimha Reddy Collections : ఈ సంక్రాంతి కి విడుదలవుతున్న సినిమాలలో గత కొద్దీ రోజుల క్రితం వరకు మంచి పోటీ ఉంటుందేమో అని అభిమానులతో పాటుగా ట్రేడ్ కూడా అనుకున్నారు..కానీ ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి అలా లేదు..వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారిపోయింది..నిన్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి వచ్చిన ఓపెనింగ్ చూసి బాలయ్య బాబు అఖండ తర్వాత మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని అందరూ అనుకున్నారు.

కానీ ‘వాల్తేరు వీరయ్య’ మేనియా వల్ల రెండవ రోజు వసూళ్లు ఇంత దెబ్బ తింటాయని ట్రేడ్ వర్గాలు సైతం ఊహించలేకపోయింది..ఒక్క సీడెడ్ మినహా, ఈరోజు వీర సింహా రెడ్డి సినిమా పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది..’వాల్తేరు వీరయ్య’ మేనియా వల్ల కలెక్షన్స్ కాస్త ఎఫెక్ట్ అయ్యింది అనేది ఒక ఒకటైతే..ప్రీ ఫెస్టివల్ ముందు రిలీజ్ రోజు సినిమాలకు తప్ప మిగిలిన సినిమాలు బాగా డ్రాప్ అవుతాయి అనేది మరొక్క రీజన్ గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

రెండవ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అయినా వస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..అఖండ వంటి ప్రభంజనం తర్వాత విడుదలవుతున్న సినిమా కావడం తో ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బలంగా జరిగింది..అఖండ చిత్రానికి ముందు బాలయ్య సినిమాలకు కనీసం 30 కోట్ల రూపాయిల బిజినెస్ కూడా జరిగేది కాదు..అలాంటిది ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి ఏకంగా 75 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది.

బాలయ్య మంచి ఊపులో ఉన్నాడు కదా..పైగా ఓపెనింగ్ కూడా అదిరిపోయింది..బ్రేక్ ఈవెన్ చాలా తేలికగా అయిపోతుంది అని అనుకున్నారు..కానీ ఈరోజు వసూళ్లను చూసి బ్రేక్ ఈవెన్ పై అనుమానాలు మొదలయ్యాయి..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ చాలా షోస్ ‘వీర సింహా రెడ్డి’ కి తొలగించి ‘వాల్తేరు వీరయ్య’ కి కేటాయిస్తున్నారు..సంక్రాంతి సెలవల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే బాలయ్య కి ఫ్లాప్ తప్పదు అంటున్నారు విశ్లేషకులు.