
Tarakaratna Birthday: నేడు నందమూరి తారకరత్న జన్మదినం..సంతోషం గా పెళ్ళాం పిల్లతో గడపాల్సిన దినం రోజు ఆయన తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం అనేది జీర్మించుకోలేని విషయం.ఎంతటి శత్రువుకైనా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోకూడదని అందరూ కోరుకునే విధమైన ఈ సందర్భాన్ని తల్చుకుంటే ఏదోలా ఉంది.గుండెపోటు తో గత 23 రోజుల నుండి చికిత్స తీసుకుంటున్న తారకరత్న ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు అనే వార్తని వింటామని అందరూ ఆశిస్తే, అనూహ్యంగా ఆయన చనిపోయాడు అనే వార్త వినాల్సి వచ్చింది.
ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహం గా ఉంటూ, అందరిని ఆప్యాయంగా పలకరించే తారక రత్న నేటి తో 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు.నందమూరి కుటుంబం లో తారకరత్న ని ఎంతో ప్రేమగా చూసుకునే మొదటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ.తన కొడుకు తో సమానం గా తారకరత్న ని చూసుకుంటూ ఉంటాడు ఆయన.
ఆయనని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుండి బాలయ్య కనీసం కడుపునిండా అన్నం తిన్న రోజులే లేవు.ఎంతసేపు తన బిడ్డకి ఆరోగ్యం పై కంగారుతినే ఉండేవాడు.వాస్తవానికి బాలయ్య – తారకరత్న కలిసి అనిల్ రావిపూడి తో తెరకెక్కబోతున్న సినిమాలో నటించాల్సి ఉంది.ఈరోజు తారకరత్న పుట్టిన రోజు కావడం తో, నేడే ఈ సినిమాని ప్రారంభించి తన బిడ్డ లాంటి తారకరత్న ని సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు బాలయ్య.కానీ ఇంతలోపే ఇలాంటి దారుణం జరిగింది.ఈ సినిమా తో తారకరత్న కెరీర్ ని మార్చేయాలని,అలాగే రాజకీయ పరంగా కూడా తారకరత్న ని ఉన్నత శిఖరాలకు చేర్చే విధమైన రూట్ మ్యాప్ మొత్తాన్ని సిద్ధం చేసిన బాలయ్య కి , ఇలా బంగారం లాంటి తన బిడ్డ తిరిగిరాని లోకాలకు పయనం అవుతాడని ఊహించేలేక పొయ్యాడు.

ఇక ఆయన పుట్టినరోజు అయినా నేడు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇంట్లో ఉన్న కుటుంబ సబ్యులకు తలచుకొని ఎంత బాధపడుతూ ఉంటారో ఊహిస్తేనే మనసు ఏదోలా అయిపోతుంది.ఆయన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.
