spot_img
Homeట్రెండింగ్ న్యూస్Viral News: ఎడారి లాంటి ప్రాంతంలో 2 నెలల పసిబిడ్డ ఆకలి తీర్చడానికి ఈ తండ్రి...

Viral News: ఎడారి లాంటి ప్రాంతంలో 2 నెలల పసిబిడ్డ ఆకలి తీర్చడానికి ఈ తండ్రి పడుతున్న కష్టాలు చూస్తే ఏడుపు ఆపుకోలేరు

Viral News
Viral News

Viral News: తెలంగాణ జిల్లాలో ఎడారి ప్రాంతాలను తలపించే గిరిజన తండాలు ఉన్నాయి.ఎన్ని ప్రభుత్వాలు మారిన పాపం ఇక్కడ నివసించే గిరిజన వాసుల బ్రతుకులు మాత్రం మారడం లేదు.  అలాంటి ఒక గూడెం లో ఇటీవల జరిగిన ఒక హృదయాల్ని పిండేసే నిజాలను తెలుసుకోబోతున్నాము. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గిరిజన తాండాలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఎడారి ని తలపించే ఈ ప్రాంత వాసీయులు తమ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే ప్రతీ రోజు ఈ తాండా కి పది కిలోమీటర్స్ దూరం లో ఉన్న ఇంద్ర వెల్లి గ్రామానికి వెళ్ళి తెచుకోవాల్సిందే. నాలుగు కిలో మీటర్లు కాలినడక వెళ్ళి ఆ తర్వాత మిగిలిన దూరం అక్కడ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను లిఫ్ట్ అడిగి వెళ్లాల్సిందే. అలాంటి ప్రాంతం లో కొడప పారుబాయి అనే 22 ఏళ్ళ అమ్మాయి , జనవరి 10 వ తేదీన ఆమె ప్రసవించింది.

Viral News
Viral News

అయితే పారు బాబు బిడ్డకి జన్మనిచ్చిన పది రోజులకే అనారోగ్యం తో తుది శ్వాసని విడిచింది. అప్పటి నుండి ఆ పసికందు ఆకలి ని తీర్చడానికి తండ్రి జంగుబాబు మరియు తాత బాపురావు పడ్డ కష్టాలు మామూలైవి కావు. ప్రతీ రోజు వారిలో ఎవరో ఒకరు రాజాగూడ దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న ఖాన్ పూర్ లో కాలినడకన,ఆ తర్వాత మరో 7 కిలోమీటర్లు వాహనాల సహాయం తో ఇంద్రవెల్లికి చేరుకొని పాల ప్యాకెట్స్ కొని తీసుకొస్తున్నారు.

ఆ చిన్న బిడ్డ ఆకలి తీర్చడం ఇంత కష్టపడడం ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నెటిజెన్స్. పోషించే స్తొమత లేక పిల్లల్ని అమ్మేస్తున్న తల్లితండ్రులు ఎంతోమంది ఉన్న ఈ రోజుల్లో, కష్టమో నష్టమో మా బిడ్డని మేమె పోషించుకుంటాము అంటూ ఈ స్థాయిలో కష్టపడుతున్న జంగు బాబు మరియి బాపు రావులకు నెటిజెన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version