Titanic Accident : టైటానిక్ పడవ ప్రమాద శిథిలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తున్న టైటాన్ అనే సబ్ మెరైన్ కనిపించకుండా పోయింది. ఈ టైటాన్ సీఈవో భార్య వెండీ రష్ 1912లో టైటానిక్‌లో మరణించిన దంపతుల మునిమనవరాలు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ కుటుంబాన్ని టైటానిక్ ప్రమాదం వదలడం లేదని నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు.

టైటానిక్‌లో నటించిన జంట..
గల్లంతైన టైటాన్ టూరిస్ట్ సబ్ మెరైన్ సీఈవో భార్య వెండీ రష్ 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ నౌక టైటానిక్ మునిగి మరణించిన అమెరికా దంపతుల వారసురాలు. జేమ్స్ కామెరూన్ హాలీవుడ్ మూవీ టైటానిక్‌లోనూ ఈ జంట నటించడం విశేషం. 1912 ఏప్రిల్‌లో టైటానిక్ నౌక మంచుకొండను ఢీకొని మునిగిపోయినప్పుడు టైటానిక్‌లో ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులుగా ప్రయాణిస్తున్న రిటైలింగ్ దిగ్గజం ఇసిడోర్ స్ట్రాస్, అతని భార్య ఇడా మనుమరాలే ఈ వెండీ రష్. స్ట్రాస్ 1845 లో జన్మించాడు. ఆయన మాసీ డిపార్ట్‌మెంట్ స్టోర్‌కు సహ యజమాని అని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
1986లో స్టాక్టన్ రష్‌తో వివాహం.. టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్‌ను నిర్వహిస్తున్న ఓషన్‌గేట్ సీఈవో స్టాక్టన్ రష్‌ను 1986 లో జూన్ 18న వివాహం చేసుకున్నారు. టైటానిక్‌కు పర్యాటకులను తీసుకెళ్తున్న జలాంతర్గామి టైటాన్‌కు కూడా ఆయన పైలట్ కొనసాగారు. ఇప్పుడు ఆ టైటాన్ అదృశ్యమైంది. గల్లంతైన జలాంతర్గామిలో ఉన్న ఐదుగురిలో స్టాక్టన్ రష్ కూడా ఒకరు.. టైటానిక్ దంపతుల వారసురాలు వెండీ రష్ ఓషన్ గేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అనీ, టైటానిక్ కు కంపెనీ చేసిన మూడు సాహసయాత్రల్లో పాల్గొన్నారని ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ తెలిపింది.
టైటానిక్ గురించి నివేదికలు
మంచుకొండను ఢీకొట్టి మునిగిపోతున్న టైటానిక్ నౌకలో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉండటంతో ఇసిడోర్ స్ట్రాస్ లైఫ్ బోట్ లో కూర్చోలేదని ఆర్కైవల్ రికార్డులు చెబుతున్నాయి. అతనితో పాటు అతని భార్య కూడా ఓడ మునిగిపోయే వరకు చేతులు పట్టుకుని ఉన్నాడు. లైఫ్ బోట్‌లో ఆమెను కాపాడుతుండగా ఇడా స్ట్రాస్ తన మింక్ జాకెట్‌ను తన పనిమనిషికి అందజేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. టైటానిక్ మునిగిన కొన్ని వారాల తర్వాత స్ట్రాస్ అవశేషాలు సముద్రంలో కనుగొనబడినప్పటికీ, అతని భార్య మృతదేహం కనుగొనబడలేదు. 1997లో జేమ్స్ కామెరూన్∙తీసిన హాలీవుడ్ చిత్రం టైటానిక్‌లో ఈ జంట కల్పిత వెర్షన్ వచ్చింది. స్ట్రాస్–అతని భార్యను వృద్ధ జంటగా చిత్రీకరించారు. అట్లాంటిక్ చల్లని నీరు వారి క్యాబిన్లోకి ప్రవేశించినప్పుడు వారు మంచంపై కౌగిలించుకోవడం ఒక షాట్ లో చూపించారు.