Titanic in AP: ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరంలో ఓ టైటానిక్ మునిగిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. దీని గురించి ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 1600 మందితో బర్మాకు వెళ్తున్న నౌక సముద్రతీరంలో 600 మీటర్ల దూరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. 1917లో ఈ నౌక మునిగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. దీని పేరు ఎస్ ఎస్ చిల్కా గా చెబుతున్నారు.

నౌకలో 1600 మంది ఉన్నా కేవలం 81 మంది మాత్రమే చనిపోయారట. దీని గురించి పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఎస్ఎస్ చిల్కా మునక గురించి విశాఖపట్నంకు చెందిన స్కూబా డ్రైవర్, రిటైర్డ్ నావికుడు బలరామ్ నాయుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సముద్ర తీరానికి చేరువలోనే మునిగిపోయినట్లు గుర్తించారు. అది కూడా నలభై మీటర్ల లోతులోనే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read: Venkaiah Naidu- Modi: వెంకయ్యకు షాకిస్తున్న మోడీ.. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన?
దీన్ని మినీ టైటానిక్ గా చెబుతున్నారు. బారువ తీరానికి ఆరువందల మీటర్ల దూరంలో నౌక మునిగిపోయింది. దీంతో నౌక గురించి కొత్త విషయాలు కనుగొనేందుకు ఎంత ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో నౌక గురించి మరిన్ని రహస్యాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. కానీ మొత్తానికి దీని గురించి పూర్తి వివరాలు కనుగొనేందుకు శ్రమిస్తున్నారు. బలరామ్ నాయుడు ఎస్ఎస్ చిల్కా గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని దాని రహస్యాలు బయటపెట్టాలని భావిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను తన సైట్ లో ఉంచగా ఆస్ట్రేలియా చరిత్రకారుడు జాన్ పి. అనే అతడు దీనికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించాడు. ఇది 17, జులై 1917లో మునిగిపోయిందని తెలిపారు. భారత్ నుంచి బర్మాకు కూలీలను చేరవేసేదిగా ఉండేదని చెబుతున్నారు. దీనిపై ఇంకా పలు విషయాలు తెలుసుకునేందుకు శ్రమిస్తున్నారు. దీన్ని చూసేందుకు కూడా అనుమతి ఇస్తున్నారు. దీంతో కొందరు పర్యాటకులు దీని దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మునిగి వందేళ్లు దాటినందున దాని చుట్టూ కొన్ని జీవరాశులు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read:KCR Vs Modi: ప్రధాని కాదు.. దేశానికి సేల్స్ మెన్ మోడీ.. శ్రీలంక ఆరోపణలపై ఇరికించిన కేసీఆర్