https://oktelugu.com/

Tik Tok Tharun: కరెంట్ షాక్ తో నాన్న చనిపోయాడు.. అన్నయ్య ఛీ కొట్టాడు.. టిక్ టాక్ తరుణ్ కన్నీటి స్టోరీ!

టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన సామాన్యులలో తరుణ్ ఒకడు. టిక్ టాక్ తరుణ్ గా పాపులర్ అయిన ఇతడు డిఫరెంట్ గెటప్స్ కి ఫేమస్. తన చుట్టూ ఉన్న వస్తువులను, పరికరాలను కాస్ట్యూమ్స్ గా మార్చి తయారు కావడం తరుణ్ ప్రత్యేకత.

Written By: Shiva, Updated On : May 12, 2023 7:11 pm
Follow us on

Tik Tok Tharun: సోషల్ మీడియా యాప్స్ సామాన్యులను సెలెబ్రిటీలు చేశాయి. ఒకప్పుడు వాళ్ళ ఊరి వాళ్ళు, కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని అనామకులు లక్షల మంది అభిమానులను సంపాదించారు. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ దేశవ్యాప్తంగా లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది. అషురెడ్డి, దీపికా పిల్లి టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. మనలోని టాలెంట్ ఎవరి ప్రమేయం, మద్దతు లేకుండా ప్రదర్శించే అవకాశం సోషల్ మీడియా యాప్స్ కల్పిస్తున్నాయి. అలా తమ టాలెంట్ తో జనాలను ఎంటర్టైనర్ చేసి అభిమానులను సంపాదించుకుంటున్నారు.

టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన సామాన్యులలో తరుణ్ ఒకడు. టిక్ టాక్ తరుణ్ గా పాపులర్ అయిన ఇతడు డిఫరెంట్ గెటప్స్ కి ఫేమస్. తన చుట్టూ ఉన్న వస్తువులను, పరికరాలను కాస్ట్యూమ్స్ గా మార్చి తయారు కావడం తరుణ్ ప్రత్యేకత. అతని డ్రెస్సింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ విధంగా తరుణ్ టిక్ టాక్ లో ఫేమస్ అయ్యాడు. లక్షల మంది ఫాలోయర్స్ ని రాబట్టాడు. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఫ్లాట్ ఫార్మ్స్ లో తన కళ ప్రదర్శిస్తున్నాడు.

ఈ టిక్ టాక్ తరుణ్ నేపథ్యం పరిశీలిస్తే గుండె బరువెక్కుతుంది. తరుణ్ తండ్రి తొమ్మిదేళ్ల వయసులో కరెంట్ షాక్ కొట్టి మరణించాడట. వ్యవసాయం చేస్తుండగా ఆయన ఈ ప్రమాదానికి గురయ్యాడట. అప్పటి నుండి అమ్మ పెంచి పెద్ద చేసిందట. తరుణ్ కి అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య అంటే తరుణ్ కి చాలా ఇష్టం. అయితే ఆయన అంతగా పట్టించుకోడట. పెద్దగా మాట్లాడట. తాను టిక్ టాక్ వీడియోలు చేయడం అన్నయ్యకు నచ్చదని తరుణ్ చెప్పారు.

తాను పనులు చేస్తూ, చదువుకుంటూ తల్లిని పోషిస్తున్నట్లు తరుణ్ చెప్పాడు. మూడు వేల రూపాయల అద్దె గదిలో ఉంటూ తన పనులు చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. తన సంపాదనలో అమ్మకు వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుతానని తరుణ్ చెప్పాడు. స్నేహితులతో తిరగడం ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకుని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతానని తరుణ్ వెల్లడించారు. తనకు నచ్చినది చేస్తూ ప్రతిదీ టాలెంటే, దాన్ని కూడా ఇష్టపడే వారు ఉంటారని తరుణ్ నిరూపిస్తున్నాడు.