Shubman Gill: ఏ ఆటగాడైనా సరే.. తన పూర్తి సత్తా చూపితేనే అతడి సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. తాను సత్తా చూపాలంటే అవకాశాలు మెండుగా రావాలి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటగాడు సత్తా కెప్టెన్ గమనిస్తాడు కాబట్టి, అలాంటి ఆటగాడికి కెప్టెన్ అవకాశాలు ఇవ్వాలి.. అప్పుడే అతడు జట్టుకు ఉపయోగపడతాడు.. విజయతీరాలకు చేర్చుతాడు.. కెప్టెన్ నమ్మకం ఉంచితే.. తక్కువ సమయంలోనే సదరు ఆటగాడు రికార్డులు తిరగ రాస్తాడు.. తాజాగా ముగిసిన న్యూజిలాండ్ టి20 సిరీస్ లో అదే జరిగింది..ఈ సీరిస్ లో భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది ఓపెనింగే. ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ పెద్దగా రాణించలేదు.

ఈ సిరీస్ లో గిల్ ఆట తీరుపై భారీగా విమర్శలు వచ్చాయి.. ఈ ఫార్మాట్ కు అతడు సరిపోడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అతడిని జట్టులో నుంచి తీసేయాలని సలహా కూడా ఇచ్చారు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం తన ఓపెనర్లపై నమ్మకం ఉంచాడు..ఇషాన్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.. సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు.. కానీ గిల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టి20 ఫార్మాట్లో సెంచరీ సాధించిన యువ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్ కు ముందు గిల్ టి20 రికార్డ్ గొప్పగా లేదు.. శ్రీలంకపై అతను పెద్దగా ఆకట్టుకోలేదు.. ఈ క్రమంలో గిల్ కొంత టెన్షన్ పడి ఉండి ఉంటాడు.. హార్దిక్ పాండ్యా ఒక సలహా ఇవ్వడంతో గిల్ లో విశ్వాసం పెరిగింది.. దీంతో అతడు తన సహజ సిద్ధమైన ఆటకు పదును పెట్టుకున్నాడు..

గిల్ నెట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు.. తన బలం ఏమిటో తెలుసుకున్నాడు.. బలహీనతను ఎలా అధిగమించాలో నేర్చుకున్నాడు.. భారీ స్కోర్ చేయగలనని నమ్మకం పెంచుకున్నాడు.. అది శ్రీలంకపై జరగలేదు.. నమ్మకం విడవకుండా ఈసారి నెట్స్ లో మరింత కష్టపడ్డాడు. ఆ కష్టం వృధాగా పోలేదు.. న్యూజిలాండ్ పై మరింత ఉపకరించింది.. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ 20 లో సెంచరీ చేసి తాను ఏంటో నిరూపించుకున్నాడు.. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మళ్ళీ కనిపిస్తాడు.