This Week OTT Release Movies: లాక్ డౌన్ సమయం లో OTT కి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు విడుదలై సూపర్ హిట్టైన కొత్త సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు..అలాంటి ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పొచ్చు..థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సినిమాలతో పాటుగా క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి..వారం మొత్తం పనులు చేసి అలసిపోయిన వారికి ఈ వీకెండ్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..ఇంతకీ ఈ వీకెండ్ OTT లో విడుదల అవ్వబోతున్న ఆ క్రేజీ మూవీస్ మరియు వెబ్ సిరీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం.
గాడ్ ఫాదర్:

దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మెగాస్టార్ స్టైల్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ కి మరియు తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు డైరెక్టర్ మోహన్ రాజా..ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 18 వ తారీకు నుండి..అనగా రేపటి నుండి తెలుగు మరియు హిందీ బాషలలో స్ట్రీమింగ్ కానుంది..థియేటర్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం OTT లో ఎలాంటి రెస్పాన్స్ ని రప్పించుకుంటుందో చూడాలి.
సర్దార్ :
ఇటీవల కాలం లో సైలెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో ఒకటి సర్దార్..కార్తీ హీరో గా, ప్రముఖ దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళం బాషలలో సూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది..కార్తీ కి ఈ ఏడాది ఇది వరుసగా మూడవ హిట్..అంటే హ్యాట్రిక్ హిట్ అన్నమాట..ఒక చక్కటి సందేశం తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం నవంబర్ 18 వ తారీకు నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

అహనా పెళ్ళంట:
ప్రముఖ యువ హీరో రాజ్ తరుణ్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ఇది..ఈ సిరీస్ లో హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది..పెళ్లయ్యే వరుకు ఏ అమ్మాయితో కూడా ప్రేమలో పడను అని తల్లికి మాట ఇచ్చిన యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడుతాడు..మరి అమ్మాయి తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా..లేక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేది స్టోరీ..జీ 5 యాప్ లో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.