
Naresh Pavithra Wedding Story: డబ్బులుంటే ఎలాంటి సరదానైనా తీర్చుకోవచ్చు. అందుకు నటుడు నరేష్ ప్రత్యక్ష నిదర్శనం. అరవై ఏళ్ల వయసులో ఆయన చర్యలు షాక్ ఇస్తున్నాయి. ఈ నిత్య పెళ్ళికొడుకు వేషాలు చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లీడుకు వచ్చిన కొడుకులను పక్కన పెట్టి ఈయన ఆ ముచ్చట తీర్చుకుంటున్నారు. తనతో సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ తో ఏకంగా సినిమా ప్లాన్ చేశాడు. తమ రియల్ లైఫ్ లో జరుగుతున్న పెళ్లి రచ్చ ఎపిసోడ్ ని కాన్సెప్ట్ గా ఎంచుకుని ‘మళ్ళీ పెళ్లి’ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. నేడు ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన చేశారు.
మళ్ళీ పెళ్లి చిత్రంలో నరేష్-పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నరేష్ నిర్మాత కూడా. దాదాపు రూ. 5-6 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. మరో విచిత్రం ఏంటంటే… ఒకటికి నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. చెప్పాలంటే పాన్ ఇండియా చిత్రమన్న మాట.
చూస్తుంటే నరేష్ తన ప్రేయసి పవిత్ర లోకేష్ చెప్పినట్లు ఆడుతున్నట్లున్నాడు. ఆమె కోరిక తీర్చేందుకే ఈ సినిమా చేశారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్న వీడియో నరేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మాకు మీ ఆశీర్వాదం కావాలని సదరు వీడియోకి కామెంట్ పెట్టాడు. దీంతో నరేష్-పవిత్రను అధికారికంగా నాలుగో పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది. పెళ్లి వీడియో కొంచెం సినిమాటిక్ టేకింగ్ కలిగి ఉండటంతో అనుమానాలు కలిగాయి.

ఈ పెళ్లి వీడియో విడుదలైన రోజు,ఇంటింటి రామాయణం అనే చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో నరేష్ పాల్గొన్నాడు. ఆయన పోస్ట్ చేసిన పెళ్లి వీడియో గురించి వివరణ అడిగితే, ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నారు. నేడు దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది. మళ్ళీ పెళ్ళి చిత్ర షూటింగ్ సన్నివేశాన్ని నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సినిమాకు ప్రచారం కల్పించారని అర్థమైంది. ఇక నిజ జీవితంలో నరేష్ కి ముగ్గురు భార్యలకు ముగ్గురు కొడుకులు. వారిలో ఇద్దరు పెళ్లీడు కొచ్చారు.