Bigg Boss 6 Telugu Elimination : బిగ్ బాస్ చరిత్రలోనే పెద్ద మోసం.. అర్జున్ ని ఎలిమినేట్ చెయ్యడానికి కారణం ఇదా..!

Bigg Boss 6 Telugu Elimination : గడిచిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటితో పోలిస్తే ఈ సీజన్ ప్రారంభం నుండే చాలా చప్పగా సాగుతూ వెళ్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆడియన్స్ లో ఆసక్తి ని రేకెత్తించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గత సీజన్స్ తో పోల్చుకునే రేంజ్ సీజన్ ఇది కాదు అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు.. గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ ఆట తీరుని, నడుచుకునే పద్దతి బట్టే హౌస్ లో […]

Written By: NARESH, Updated On : October 23, 2022 10:42 pm
Follow us on

Bigg Boss 6 Telugu Elimination : గడిచిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటితో పోలిస్తే ఈ సీజన్ ప్రారంభం నుండే చాలా చప్పగా సాగుతూ వెళ్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆడియన్స్ లో ఆసక్తి ని రేకెత్తించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గత సీజన్స్ తో పోల్చుకునే రేంజ్ సీజన్ ఇది కాదు అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు.. గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ ఆట తీరుని, నడుచుకునే పద్దతి బట్టే హౌస్ లో కొనసాగుతూ వచ్చేవాళ్ళు..కానీ ఈ సీజన్ లో మాత్రం ఆడియన్స్ ఓటింగ్స్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ ఇష్టానికి తగ్గట్టుగానే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి అనే భావన చూసే ప్రేక్షకుల్లో కలుగుతుంది.

దానికి ఉదాహరణగా నిలిచింది ఈ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్..ప్రారంభం లో కాస్త తక్కువగానే ఆడినప్పటికీ..గత రెండు వారాల నుండి అర్జున్ హౌస్ లో ప్రతి విషయంలో చెలరేగి ఆడాడు..అర్జున్ ఆడే తీరుని చూసి కచ్చితంగా ఇతగాడు టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు..కానీ ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు.

అర్జున్ ఎలిమినేషన్ అనేది నిజంగా అన్యాయం అనే చెప్పాలి..ఎందుకంటే అర్జున్ తో పోలిస్తే చాలా తక్కువగా ఆడే కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు..ఉదాహరణకి తీసుకుంటే వాసంతి, శ్రీ సత్య, మెరీనా మరియు రోహిత్ వీళ్ళెవ్వరూ కూడా అర్జున్ ఆట తీరు తో కనీసం పోల్చుకోవడానికి కూడా అర్హులు కాదు..అలాంటిది ఇంత అద్భుతంగా ఆడే అర్జున్ ఎలిమినేట్ అవ్వడం ఏమిటి అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు..ఇక బిగ్ బాస్ చూడడం వేస్ట్ అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..అయితే ఇలా ఊహకందని ఎలిమినేషన్స్ చేయడానికి కూడా ఒక కారణం ఉందంటున్నారు విశ్లేషకులు..ఎందుకంటే గడిచిన సీజన్స్ లో సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో జరిగే పోలింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యిపోతున్నారు అనేది చాలా తేలికగా అంచనా వేసేవారు.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎలిమినేషన్స్ కూడా జరిగేవి..దీనివల్ల ప్రేక్షకుల్లో థ్రిల్లింగ్ ఫీల్ బాగా మిస్ అయిపోతుందని బిగ్ బాస్ టీం దృష్టికి వచ్చిందట..అందుకే ఇలా ఎవ్వరికి ఊహకందని ఎలిమినేషన్స్ ని పెడుతున్నారు అంటున్నారు..

వాస్తవానికి వచ్చిన ఓటింగ్ ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మెరీనా ఎలిమినేట్ అవ్వాలి..కానీ అది జరగలేదు..ఇన్ని సీజన్స్ నిజాయితీగా నడిచిన బిగ్ బాస్ ఈ సీజన్ డిజాస్టర్ గా నిలవడానికి కారణాలు ఇలాంటివే అని అంటున్నారు ప్రేక్షకులు..మరి సోషల్ మీడియా నుండి వస్తున్నా ఈ ట్రోలింగ్స్ ని చూసి అయినా బిగ్ బాస్ గేమ్ ఫెయిర్ గా మారుతుందో లేదో చూడాలి.