Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: షాకింగ్ మేటర్ లీక్... ఆ ఇద్దరి వలనే జబర్దస్త్ వదిలేసిన అనసూయ, లక్షలు ఇస్తానన్నా...

Anasuya Bharadwaj: షాకింగ్ మేటర్ లీక్… ఆ ఇద్దరి వలనే జబర్దస్త్ వదిలేసిన అనసూయ, లక్షలు ఇస్తానన్నా నో!

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయకి జీవితం ఇచ్చిన షో జబర్దస్త్. ఆ కామెడీ షోకి అంతకు ముందు అనసూయ కనీసం ఎవరో కూడా తెలియదు. సదరు షో ఊహించని సక్సెస్ కావడంతో యాంకర్ గా ఉన్న అనసూయ కూడా ఫేమ్ తెచ్చుకుంది. దానికి తోడు మొహమాటం లేకుండా స్కిన్ షో చేయడం ఆమెకు కలిసొచ్చింది. బోల్డ్ యాంకర్ అన్న ఇమేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ షోలో అనసూయ జర్నీ ఏళ్ల తరబడి సాగింది. 2013లో జబర్దస్త్ మొదలు కాగా… అనసూయ యాంకర్ గా ఎంపికైంది. మధ్యలో వ్యక్తిగత కారణాలతో ఆమె షో నుండి బ్రేక్ తీసుకున్నారు. దీంతో రష్మీకి ఛాన్స్ వచ్చింది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేయడం వలన అనసూయ రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇతర ఛానల్స్ లో కూడా ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. అనసూయ స్టార్ యాంకర్ అయ్యారు. ఆపై నటి, హీరోయిన్ వరకు ఎదిగారు. అనసూయ తాను ఈ స్థాయికి వెళుతుందని కలలో కూడా ఊహించి ఉండదు. జీవితం అంటే అదే మరి. ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. అనసూయ ప్రస్తుతం డిమాండ్ ఉన్న టాలీవుడ్ యాక్ట్రెస్.

నటి అయ్యాక కూడా అనసూయ జబర్దస్త్ వదల్లేదు. అయితే గత ఏడాది సడన్ గా తన రాజీనామా ప్రకటించింది. త్వరలో షో వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ చంటి, రాఘవ వెళ్లిపోవద్దని బ్రతిమిలాడారు. ఎవరు చెప్పినా అనసూయ వినలేదు. షో నుండి బయటకు వచ్చాక ఆమె కొన్ని కారణాలు తెలియజేశారు. రెండేళ్లుగా జబర్దస్త్ వదిలేయాలని ప్రయత్నం చేస్తున్నాను, అగ్రిమెంట్ ముగియడంతో ఇప్పుడు బయటకు వచ్చేశానని చెప్పారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఈ క్రమంలో అనసూయ ఒక ఆరోపణ కూడా చేశారు. షోలో కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడేవారు. వారి కామెంట్స్, సెటైర్స్ మనసును బాధించేవి అన్నారు. అయితే అది కారణం కాదన్నారు. ఎట్టకేలకు అనసూయ నిర్ణయం వెనుక అసలు కారణం బయటకు వచ్చింది. కేవలం తన కొడుకుల కోసమే అనసూయ జబర్దస్త్ మానేశారట. తమకు టైం కేటాయించాలని ఇద్దరు కుమారులు కోరారట. పిల్లలకంటే సంపాదన ఎక్కువ కాదని అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నారట. మల్లెమాల వాళ్ళు రెమ్యూనరేషన్ పెంచుతామని చెప్పి ఆపే ప్రయత్నం చేసినా… అనసూయ వెనక్కి తగ్గలేదట.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version