https://oktelugu.com/

Ramya Krishnan: అమాయకంగా ఉన్న ఈ అమ్మాయి అప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలతో బిజీ..

Ramya Krishnan: అందం, అభినయమే కాదు.. ఆహార్యంతో మెప్పించగల నటి ఆమె. స్టార్ హీరోలతో పోటీ పడి మరీ వారికి ధీటుగా తన నటనస్వరూపాన్ని ప్రదర్శించారు. సినిమాల్లో ఆమె ఉందంటే హీరోతో సంబంధం లేకుండా మహిళా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. నాడు హీరోయిన్ గానే కాకుండా నేడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నెంబర్ వన్ నటిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరబ్బా? అనే ఆత్రుత ఉండనిది ఎవరికి? మరి వెంటనే ఆమె గురించి తెలుసుకోండి. ఇటీవల […]

Written By: , Updated On : April 3, 2023 / 03:25 PM IST
Follow us on

Ramya Krishnan

Ramya Krishnan

Ramya Krishnan: అందం, అభినయమే కాదు.. ఆహార్యంతో మెప్పించగల నటి ఆమె. స్టార్ హీరోలతో పోటీ పడి మరీ వారికి ధీటుగా తన నటనస్వరూపాన్ని ప్రదర్శించారు. సినిమాల్లో ఆమె ఉందంటే హీరోతో సంబంధం లేకుండా మహిళా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. నాడు హీరోయిన్ గానే కాకుండా నేడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నెంబర్ వన్ నటిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరబ్బా? అనే ఆత్రుత ఉండనిది ఎవరికి? మరి వెంటనే ఆమె గురించి తెలుసుకోండి.

ఇటీవల స్టార్ హీరోయిన్లకు సంబంధించిన చైల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కొందరు హీరోలు, హీరోయిన్లు తమ చిన్నప్పటి గుర్తుగా తీసుకున్న పిక్స్ ను బయటకు తీస్తున్నారు. వాటిని వైరల్ చేసి తమ పాత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లేటేస్టుగా ఓ స్టార్ హీరోయిన్ తన చైల్డిష్ ఫొటోను నెట్టింట్లో షేర్ చేసింది. ఇప్పుడా పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Ramya Krishnan

Ramya Krishnan

1990 దశకంలో స్టార్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. ఆ సమయంలో సౌందర్య, రంభ లాంటి హీరోయిన్లు కొనసాగినా రమ్యకృష్ణకు ఉన్న ప్రత్యేకత వేరు. ఎలాంటి పాత్రకైనా రమ్యకృష్ణ న్యాయం చేసేవారు. అలనాడు స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి మేటి నటులతో పోటీ పడి మరీ నటించింది. అయితే రమ్యకృష్ణ కు సాధారణ హీరోయిన్ కంటే అహార్యం కలిగిన పాత్రలనే ఎక్కువగా ఇచ్చేవారు. అలా స్టార్ హీరో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో రమ్యకృష్ణ ఆయనతో పోటీపడి నటించింది. ఈమె నటనను చూసి రజనీకాంత్ షాక్ అయ్యారట.

రమ్యకృష్ణ స్వస్థలం చెన్నై. 1967 సెప్తెంబర్ 15న జన్మించారు. 1985లో ‘భలే మిత్రులు’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాలన్నింటిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. 1990-2000 మధ్య అప్పుడున్న ప్రతీ హీరోతో రమ్యకృష్ణ నటించి మెప్పించారు. ఆ తరువాత డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి అతడిని పెళ్లి చేసుకున్నారు.

ఇటీవల రమ్యకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమాయకంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఈమె తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫొటోను బయటపెట్టింది. దీంతో ఈ పిక్ తో ఆమె అభిమానులు సందడి చేస్తున్నారు. ఆ సమయంలో రమ్యకృష్ణ అస్సలు గుర్తుపట్టకుండా ఉన్నారు. ఇప్పటికీ, అప్పటికీ చాలా తేడా ఉందని అంటున్నారు. ఏదీ ఏమైనా రమ్యకృష్ణ ఎవర్ గ్రీన్ నటినే అని ఆమె అభిమానులు పొగుడుతున్నారు.