https://oktelugu.com/

Heroines Remuneration: టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు వీరే..

Remuneration of Telugu heroines : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం రావడం అంటే అదృష్టమే. ఎందుకంటే గౌరవ మర్యాదలతో పాటు ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అంతేకాకుండా కొద్ది కాలంలోనే స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే యువతులకు అందం, అభినయంతో పాటు నటన టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే వారు అనుకున్న రేంజ్ లో పారితోషికం తీసుకుంటారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు పాత్రల్లో జీవించినా వారికి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2021 / 09:48 AM IST
    Follow us on

    Remuneration of Telugu heroines : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం రావడం అంటే అదృష్టమే. ఎందుకంటే గౌరవ మర్యాదలతో పాటు ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అంతేకాకుండా కొద్ది కాలంలోనే స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే యువతులకు అందం, అభినయంతో పాటు నటన టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే వారు అనుకున్న రేంజ్ లో పారితోషికం తీసుకుంటారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు పాత్రల్లో జీవించినా వారికి పెద్దగా రెమ్యూనరేషన్ ఉండేది కాదు. అయినా చాలా కాలం పాటు సినిమాల్లో కొనసాగారు. అయితే నేటి తరం హీరోయిన్లు కొన్ని సినిమాల్లో నటించినా.. ఆ సినిమాల్లో పారితోషికం భారీగా తీసుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్టయితే చాలు అమాంతం తమ రేటును పెంచేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ నటీమణులు పారితోషికం ఒక్కొక్కరు ఎంతెంత తీసుకుంటున్నారో చూద్దాం..

    tollywood heroins

    రష్మిక మందానా: ‘చలో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రెండో సినిమా హిట్టు తరువాత పారితోషికం అమాంతం పెంచేసింది.ప్రస్తుతం ఈ భామ ఒక్కో సినిమాకు రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది.

    సమంత: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమధ్యే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రం కొనసాగుతోంది. మొదటి సినిమాతోనే పాపులర్ నటిగా గుర్తింపు పొందిన సమంత ఆ తరువాత అగ్రహీరోలందరితో నటించింది. దీంతో ఈ సుందరి కూడా తన రేటును బాగానే పెంచింది. ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.

    అనుష్క: ‘సూపర్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తరువా సూపర్బ్ హీరోయిన్ అనిపించుకుంది. బాలీవుడ్ సినిమాలో నటించిన అనుష్క ఆ తరువాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ నటిస్తున్న అనుష్క రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటుందట. ఈ భామ 3.5 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందట.

    నయనతార: మొదట్లో సైడ్ పాత్రలుగా నటించిన నయన తార ఆ తరువాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. హీరో పక్కన నటించడమే కాకుండా సోలో హీరోయిన్ సినిమాలు బాగానే చేసింది. దీంతో ఈ భామకు క్రేజ్ బాగా పెరిగింది. అదే స్థాయితో రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది.

    పూజాహెగ్డే: బేసిగ్గా బాలీవుడ్ ఇండస్ట్రీ అయినా తెలుగులో స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ‘అరవింద సమేత’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన పూజా ఇక్కడే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ పారితోషికం రూ.3 నుంచి 4 కోట్ల వరకు ఉంది.

    కీర్తి సురేశ్: అందమైన ఆకారంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేశ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమె నటించినవి కొన్ని సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అమ్మడు ఒక్కో సినిమాకు ఒక కోటి నుంచి 2.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది.

    రకుల్ ప్రీత్ సింగ్: హిట్టు, ఫట్టుతోసంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఆమె ఒక్కో సినిమాకు కోటి రూపాలయ వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘కొండపొలం’ ఆకట్టుకుంది.