
Goods Price: బంగారం మరింత ప్రియం కానుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బంగారు ఆభరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. టీవీలు, ఎలక్ట్రానిక్ వాహనాలు ధరలు మాత్రం తగ్గనున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పెరిగే, తగ్గే ధరలు అమల్లోకి రానున్నాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త
ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ నుంచి కొన్ని వస్తువులు ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్లో సుంకాలు, పన్ను స్లాబుల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. ఎంసీఏ తయారైన ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కొన్ని వస్తువులు ధరలు పెరగనున్నాయి. కొన్ని వస్తువులు ధరలు తగ్గనున్నాయి. ధరలు తగ్గే వస్తువులు ఏవి, ధరలు పెరిగే వస్తువులు ఒకసారి తెలుసుకుందాం.
బడ్జెట్ పెట్టిన ప్రతిసారి మార్పులు..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రతిసారి పలు రకాల వస్తువుల ధరలు పెరగడం, తగ్గడం చూస్తుంటాము. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అదే విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు, తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నాయి.

ధరలు పెరిగే వస్తువుల ఇవే..
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరలు పెరగబోతున్న వస్తువులు కొన్ని ఉన్నాయి. ప్రైవేటు జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ప్లాటినం వస్తువులు, ఇమిటేషన్ ఆభరణాలు, ఎలక్ట్రానిక్ కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు ధరలు పెరగనున్నాయి.
ధరలు తగ్గే వస్తువులు ఇవే..
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని రకాల వస్తువులు ధరలు తగ్గనున్నాయి. వీటి జాబితాలో దుస్తులు, వజ్రాలు, రంగురాళ్లు, బొమ్మలు, సైకిల్లు, టీవీలు, ఇంగువ, కాఫీ గింజలు, శీతలీకరించిన నత్త గుల్లలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ చార్జర్లు, కెమెరా లెన్సులు, భారత్లో తయారైన వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి.