https://oktelugu.com/

Hyper Adi : హైపర్ ఆదికి పెళ్లయ్యిందా? ఈ అమ్మాయి ఎవరు?

బుల్లితెర స్టార్ హైపర్ ఆది పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. పట్టుబట్టల్లో మెడలో దండలతో హైపర్ ఆది దంపతులు చూడముచ్చటగా ఉన్నారు. హైపర్ ఆది పెళ్లి ఫోటోలతో వీడియో వైరల్ అవుతుండగా… పెద్ద చర్చకు దారి తీసింది. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్కిట్స్ ఒక సెన్సేషన్. టైమింగ్ పంచ్ లకు పెట్టింది పేరు. జబర్దస్త్ లో నెంబర్ వన్ టీమ్ గా హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2022 / 10:37 AM IST
    Follow us on

    బుల్లితెర స్టార్ హైపర్ ఆది పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. పట్టుబట్టల్లో మెడలో దండలతో హైపర్ ఆది దంపతులు చూడముచ్చటగా ఉన్నారు. హైపర్ ఆది పెళ్లి ఫోటోలతో వీడియో వైరల్ అవుతుండగా… పెద్ద చర్చకు దారి తీసింది. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్కిట్స్ ఒక సెన్సేషన్. టైమింగ్ పంచ్ లకు పెట్టింది పేరు. జబర్దస్త్ లో నెంబర్ వన్ టీమ్ గా హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ పేరు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్ టీమ్ ని కూడా ఒక దశలో హైపర్ ఆది సింగిల్ గా బీట్ చేశాడు.

    ఇప్పుడు పలు షోలలో పండించే కామెడీ హైపర్ ఆదీనే రాస్తూ ఉంటాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్స్, జడ్జెస్ మధ్య సంభాషణలు, కామెడీ పంచ్ లు అప్పటికప్పుడు వచ్చేవి కావు. ప్రోగ్రాం కి ముందు కొంత ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళు వేసే కామెడీ పంచులు, సెటైర్లు ఆది రాస్తాడు. ఈ క్రమంలో మనోడి కామెడీ పలు సందర్భాల్లో వివాదాస్పదమైంది. టాప్ సెలెబ్రిటీలు, గవర్నమెంట్స్, కొన్ని సామాజిక వర్గాలను ఉద్దేశించి వేసిన జోక్స్ విమర్శల పాలయ్యాయి.

    పెద్ద ఎత్తున దుమారం రేపిన నేపథ్యంలో క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఆయన పంచెస్, టైమింగ్ కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బుల్లితెర ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. కాగా హైపర్ ఆది ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని ఎలాంటి సమాచారం కూడా లేదు. అయితే సడన్ గా హైపర్ ఆది పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పట్టువస్త్రాలు, పూల మాలలు ధరించి హైపర్ ఆది పెళ్లి పందిరిలో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

    ఆ వీడియో చూసిన జానాల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేం సడన్ ట్విస్ట్ అని అభిమానులు షాక్ లోకి వెళ్లారు. ఫోటోలు చూస్తే టీవీ షోలో జరిగినట్లు లేదు. నేపథ్యం మొత్తం నిజమైన పెళ్లిలా ఉంది. దీంతో భార్యగా హైపర్ ఆది పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కడలేని సస్పెన్సుకి దారి తీసిన ఆ వీడియో సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. మరోవైపు హైపర్ ఆది రహస్య వివాహం చేసుకొని ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది.  హైపర్ ఆది స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ అనుమానాలు తీరవు.

    https://youtube.com/shorts/HDn0PSWDAc0?feature=share