California Goats: అమెరికాలో ఉన్న ఎక్కడ గుట్టల్లో చూసినా ఇప్పుడు మేకలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో పచ్చిక బైలును మేకలు మాయం చేస్తున్నాయి. వీటిని చూసి చాలా మంది మేకలు పెంచుకుంటున్నారా? అనే సందేహం వస్తుంది. సాధారణంగా మేకలను మాంసం ఉత్పత్తి కోసం పెంచుతూ ఉంటారు. కొందరు ఉపాధి కోసం పెంచుకుంటున్నారు. కానీ ఈ మేకలను ఎందుకు పెంచుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అడవుల్లో మంటలను ఆర్పేందుకు అని చాలా మంది అంటున్నారు. అడవుల్లో మంటలను ఆర్పడానికి మేకలు ఏం చేస్తాయి? అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటేంటే?
అమెరికా పరిసర ప్రాంతాల్లో కార్చిచ్చులు ఎక్కువ. ఇక్కడి అడవుల్లో ఒక్కసారి మంటలు అంటుకుంటే అడవి మొత్తం మాయం అవుతుంది. 1980 నుంచి కాలిఫోర్నియా కార్చిచ్చులకు కేంద్రంగా మారింది. అప్పటి నుంచి అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చులతో 9.60,000 ఎకరాల్లోని చెట్లు కాలిపోయాయి. 2022 సీజన్ లో 3 లక్షల ఎకరాలకు పైగా అడవులు కాలిపోయాయి. అయితే 2023 ఏడాది కాలిఫోర్నియా చల్లటి వాటావరణాన్ని కలిగి ఉంది. అయినా 5 లక్షల ఎకరాలు కాలిపోయాయి. 2021లో కాలిఫోర్నియాలో అనూహ్యమైన కార్చిచ్చు ప్రమాదాలను ఎదుర్కొందని కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్, ది స్టేట్ ఫైర్ కంట్రోల్ కంపెనీ తెలిపింది.
ఈ తరుణంలో కాలిఫోర్నియాలోని అడవుల్లో మంటలను ఆర్పేందుకు మేకలను పెంచుతున్నారు. కొన్ని కంపెనీలు, మున్సిపల్ అధికారులు అడవుల్లో మంటలను ఆర్పేందుకు మేకలే సహాయ పడుతాయని భావించారు. ఇక్కడున్న చోయ్ అనే కంపెనీ 700 మేకలను పెంచుతోంది. డిమాండ్ కు అనుగుణంగా మరిన్న మేకలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. గడ్డి వాములను, పచ్చిక బయళ్లను శుభ్రపరిచేందుకు నగర సంస్థలకు, పాశాలలకు, ప్రైవేట్ క్లయింట్లకు చోయ్ కుటుంబం మేకలు అమ్ముతోంది.
అయితే ఇతర జంతువుల కంటే మేకలను మాత్రమే ఎందుకు పెంచుతున్నారనే సందేహం చాలా మందికి వచ్చింది. ఇతర జంతువులతో పోలిస్తే మేకలు తమ కాళ్లపై నిలబడి 6 నుంచి 7 మీటర్ల ఎత్తులో ఉన్న ఆకులను, చెట్లను తినగలుగుతాయి. అంతేకాకుండా ఇవి విషపూరితమైన ఆకులను తింటాయి. కార్చిచ్చు ప్రమాదాలను నివారించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు. ఈ విధానం కాలిఫోర్నియాలో కొత్త అని అంటున్నారు. అగ్నిమాపక విభాగంలో జంతువుల వాడకంపై దశాబ్దకాలంలో ప్రయోగాలు జాగుతున్నాయని అంటున్నారు.
అడవికి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాతనికి మధ్యల ఉన్న 300 అడుగుల భూమిని శుభ్రపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అమెరికా అటవీ విభాగం తెలిపింది.అమెరికా అటవీ విభాగం అంచనా ప్రకారం ఒక్కో ఎకరాన్ని చదును చేసేందుకు 1200 నుంచి 1500 డాలర్ల వరకు ఖర్చు చేయాలి. అదే మేకల ద్వారా 400 నుంచి 500 వరకు ఖర్చు అవుతుంని తెలిపింది. మేకలు మేసిన తరువాత ఈ భూమిని మేనేజర్లు పర్యవేక్షిస్తారని పేర్కొంటున్నారు.