
Mango Varieties: పండ్లన్నింటిలో రారాజు మామిడి. ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా కనిపించే మామిడిని చూస్తే ఎవ్వరికైనా నోరూరకుండా ఉండదు. మిగతా వాటితో చూస్తే పెద్దదిగానూ.. అత్యంత రుచికరంగానూ ఉంటుంది. మామిడి పండ్లు చెట్ల మీది నుంచి ఎలాంటి ప్రక్రియను లోను కాకుండా నేరుగా మార్కెట్లోకి వస్తాయి. అందుకే వీటికి ఆదరణ ఎక్కువ. అయితే కొందరు వీటిని త్వరగా పండించేందుకు కార్పైడ్ వంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి వచ్చే ఏ పండు నాచురలో.. కాదో తెలియిన పరిస్థితి ఉంది. పట్టణాలు, నగరాల్లో పైకి ఆకర్షణీయంగా కనిపించేవాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కాని ఇవి నాచురల్ గా పండినవి కాదని గుర్తించాలి.
మామిడి పండ్ల ఉత్పత్తితో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఇక్కడ పండినవి అమెరికా, తదితర దేశాలకు ఎక్స్ పోర్టు అవుతూ ఉంటాయి. ప్రతీ సంవత్సరం సుమారు 1.09 కోట్ల టన్నుల మామిడి ఎగుమతి అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సూర్యరశ్మి, వర్షం తదితర అనుకూల వాతావరణంతో ఇక్కడ మామిడి అధికంగా పండుతుంది. దేశంలో దాదాపు 1500 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. కానీ వీటిలో ప్రతీ సంవత్సరం 10 రకాల అత్యున్నతమైనవి మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
1. అల్ఫోన్సో:
ఈ రకం మామిడిని ‘కింగ్’గా పోలుస్తారు. ఎందుకంటే మిగతా వాటికంటే ఇవి అత్యంత రుచిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మహారాష్ట్రలో పండించేవారు. ఇప్పుడు గుజరాత్, కర్ణాటకలో కూడా పండిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన అల్ఫోన్సో మామిడి అంటే ఒకప్పుడు ఫేమస్. వీటిని యూరప్, జపాన్, కొరియా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ రకాన్ని పోర్చుగీసు నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేశారని చెబుతున్నారు.
2. కేసర్:
కుంకుమ కలర్ ను పోలి ఉండే మామిడిని ‘కేసర్’ అని అంటారు. దీనిని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనిని ‘మామిడి రాణి’గా పిలుస్తారు. గుజరాత్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో దీని ఉత్పత్తి ఉంది. వీటిని అమెరికాలో ఎక్కువగా విక్రయిస్తారు. 2020లో దేశం నుంచి ఎగుమతి అయిన మామిడి రకాల్లో కేసర్ 50 నుంచి 55 శాతాను వాటా కలిగి ఉండడం విశేషం.
3. దసరి:
ఉత్తరప్రదేశ్లోని లక్నో,మలిహాబాద్ లో దసరి మామిడి రకం ఎక్కువగా పండుతుంది. లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిలాబాద్ దసరి మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఇవి పొడుగు ఆకారం, ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. ఫైబర్ లేని, గుజ్జు మామిడిలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ పోషకాలు ఉంటాయి. 200 ఏళ్ల కిందట కకోరీ సమీపంలో దసరి గ్రామంలో దీనిని కనుగొన్నారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
4. హిమాసాగర్:
పశ్చమబెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించే మామిడి రకం హిమాసాగర్. అయితే దీనిని ఇప్పుడు బీహార్ లో కూడా పండిస్తున్నారు. ఆకుపచ్చ రంగు, మామిడి క్రీము గుజ్జును కలిగి ఉండే ఇది డెజర్ట్, షేక్ లనుతయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రకం కూడా ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి.

5. చౌసా:
మామిడి ని పీల్చే రకాల్లో చౌసా ఒకటి. దీని సువాసన అద్భుతంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్, బీహార్ లల్లో ఇది ఎక్కువడా పండుతుంది. బీహార్ లోని చౌసాలఓ చక్రవర్తి షేర్ షా సూరిచే ఇది ప్రాచుర్యం పొందింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెప్పుకుంటారు. దీని జ్యూస్ ను ఎక్కువగా వంటకాల్లోఉపయోగిస్తారు.
6. బాదామి:
కర్ణాటకలో ఎక్కువగా పండించే బాదామి రుచి అద్భుతంగా ఉంటుంది. దీనిని గుజరాత్, మహారాష్ట్రలో కూడా పండిస్తున్నారు. మామిడి సీజన్ ప్రారంభంలోనే ఇవి విరివిగా లభిస్తాయి. ప్రకాశంతమైన బంగారు-పసుపు కలర్లో కనిపించే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
7. సఫేదా:
దీనినే బంగన్ పల్లి అనికూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో పండుతుంది. ఒకప్పుడు నవాబులు, ఇతర రాజులు ఈ పండును ఎక్కువగా తెప్పించుకునేవారు. మిగతా వాటిలో కంటే ఇందులో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కో పండు దాదాపు అరకిలో వరకు ఉంటుంది. భారతదేశంలోని పండించే సఫేదాను సింగపూర్, అమెరికా, జపాన్, కెనడా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.
8. లంగ్డా:
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పండించే లంగ్డా పశ్చిమ బెంగాల్, బీహార్ లోప్రాచుర్యం పొందాయి. ఓవల్ ఆకారంలో, ఆకుపచ్చ రంగులో ఉండే ఈ మామిడి తియ్యగా ఉంటాయి. దీనిని బనారసి అనికూడా పిలుస్తారు. వీటిని సాదారణంగా వర్షకాలం తరువాత జూలైలో పండిస్తారు.

9. తోతాపుర:
కర్ణటకలో ఎక్కువగా పండే తోతాపురి తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుతుంది. ఇది దీర్ఘచతురస్రాకారం కలిగి ఉంటుంది. ఇది పచ్చగా ఉండి దాని చివర చిలక ముక్కులా కనిపిస్తుంది. అందుకే దీనికి తోతాపురి అని పేరు పెట్టారు. దీనిని ఎక్కువగా చట్నీల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
10. ముల్లోవా:
తమిళనాడు, కర్ణాటకలో పండే ఈ రకం మామిడి యూఎస్ లో ఎక్కువగా అమ్ముడు పోతుంటాయి. 1989లో మార్షల్ వుడ్రో అనే ఫ్రొఫెసర్ ఫ్లోరిడాలో నివసిస్తుున్న రిటైర్డ్ ప్రొఫెసర్ వద్దకు 12 మొక్కలను తీసుకెళ్లాడు. వీటిలో 10 మరణించాయి. రెండు మాత్రమే మిగిలాయి. ఆ రెండు మొక్కలు ముల్గోవా రకానికి చెందినవి. ఇవి ఎక్కువ కాలం జీవించి ఉండడం వీటి ప్రత్యేకత.