https://oktelugu.com/

Srileela : శ్రీలీల దెబ్బకి షెడ్డుకి వెళ్లిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

Srileela : టాలీవుడ్ లో హీరోయిన్ కెరీర్ కాలపరిమితి హీరోల కెరీర్స్ తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది.స్టార్ హీరోలు దశాబ్దాలుగా పైగా సూపర్ స్టార్స్ గా ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగితే, హీరోలు మాత్రం కేవలం పదేళ్లు మాత్రమే స్టార్ స్టేటస్ తో ఇండస్ట్రీ లో కొనసాగుతారు.కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు.అలాంటి వారిలో త్రిష , నయనతార, అనుష్క వంటి వాళ్ళు ఉన్నారు.కానీ కొంతమంది […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2023 / 09:57 PM IST
    Follow us on

    Srileela : టాలీవుడ్ లో హీరోయిన్ కెరీర్ కాలపరిమితి హీరోల కెరీర్స్ తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది.స్టార్ హీరోలు దశాబ్దాలుగా పైగా సూపర్ స్టార్స్ గా ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగితే, హీరోలు మాత్రం కేవలం పదేళ్లు మాత్రమే స్టార్ స్టేటస్ తో ఇండస్ట్రీ లో కొనసాగుతారు.కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు.అలాంటి వారిలో త్రిష , నయనతార, అనుష్క వంటి వాళ్ళు ఉన్నారు.కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొత్త హీరోయిన్ల రాకతో ఒక్కసారిగా డిమాండ్ మొత్తం పోయి ఇంటికి పరిమితమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీలీల దాటికి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు డిమాండ్ పూర్తిగా కోల్పోయి అవకాశాల కోసం బిక్కమొహం వేసుకున్నారు.అలా శ్రీలీల దెబ్బకి షెడ్డుకు వెళ్లిన హీరోయిన్స్ లిస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    ముందుగా పూజా హెగ్డే గురించి మనం మాట్లాడుకోవాలి.నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోలందరికీ ఈమె హీరోయిన్ గా అవసరం అయ్యేది, కానీ ఇప్పుడు పాపం ఈమె చేతిలో త్రివిక్రమ్ మహేష్ సినిమా తప్ప మరొకటి లేదు.రీసెంట్ గా ఆమెకి వరుసగా ఫ్లాప్స్ రావడం, అదే సమయం లో శ్రీలీల ఇండస్ట్రీ లోకి దూసుకురావడంతో పాపం పూజ హెగ్డే డిమాండ్ బాగా పడిపోయింది.విచిత్రం ఏమిటంటే రీసెంట్ గానే ఈమె పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించబోతుంది అనే వార్తలు వచ్చాయి.ఆమెని మూవీ టీం సంప్రదించారు కూడా, కానీ పారితోషికం ఎక్కువ డిమాండ్ చెయ్యడం తో శ్రీలీల ని తీసుకున్నారు.అలా శ్రీలీల కారణం గా ఒక అవకాశం ని కోల్పోయింది పూజా హెగ్డే.ఇక మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ ఒక వెలుగు వెలిగిన రష్మిక అవకాశాలను కూడా శ్రీ లీల గండి కొట్టేసింది.ప్రస్తుతం ఆమె చేతిలో ‘పుష్ప ది రూల్’ అనే సినిమా మినహా మరొకటి లేదు, స్టార్ డైరెక్టర్స్ మరియు స్టార్ హీరోలు కూడా ఆమెకంటే శ్రీలీలనే బెటర్ ఛాయస్ గా అనుకుంటున్నారు.

    ఇక ‘ఉప్పెన’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్టు తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మరో హీరోయిన్ కృతి శెట్టి.ఆ సినిమా తర్వాత ఈమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి కానీ, ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.దీనితో దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈమె వైపు చూడడం మానేసి శ్రీలీల కోసమే చూస్తున్నారు.అలా శ్రీలీల వల్ల ఇంత మంది స్టార్ హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అయిపోయే ప్రమాదం ఏర్పడింది అన్నమాట.ప్రస్తుతం శ్రీలీల చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమా, నితిన్ తో ఒక సినిమా , రామ్- బోయపాటి సినిమా , పంజా వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా, నవీన్ పోలిశెట్టి తో మరో సినిమా ఇలా వరుసగా 7 సినిమాలకు సంతకం చేసింది.రాబొయ్యే రోజుల్లో ఈమె మేనియా ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.