
Uppena Movie: మెగాస్టార్ చిరంజీవి రెండవ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.పాటలు భారీ హిట్ అవ్వడం తో పాటుగా, కథలోని కీలకమైన ట్విస్ట్ ముందుగానే లీక్ అవ్వడంతో,ఈ మూవీ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి విడుదలకు ముందే చేరుకుంది.ఇక విడుదల తర్వాత ఉదయం ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం తో ఈ సినిమాకి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు ట్రేడ్ పండితులకు కూడా మతి పొయ్యే నంబర్స్ ని నమోదు చేసి సంచలనం సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి దాదాపుగా అప్పట్లోనే 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.మొదటి సినిమాతోనే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం అంటే వైష్ణవ్ తేజ్ అదృష్టం మామూలుది కాదు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య సాయి ధరమ్ తేజ్ ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లను చూడలేదు.
అయితే ఈ సినిమాని తొలుత డైరెక్టర్ బుచ్చి బాబు న్యాచురల్ స్టార్ నాని తో తీద్దాం అనుకున్నాడట.నాని కి కథ బాగా నచ్చింది కానీ, క్లైమాక్స్ బాగా రిస్క్ అనిపించి మార్చమన్నాడట.కానీ అందుకు బుచ్చి బాబు ఒప్పుకోలేదు, దీనితో ఈ సినిమా నాని చేతుల్లో నుండి జారిపోయింది.ఆ తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ వద్దకి కూడా ఈ స్టోరీ వెళ్లిందట.కానీ ఆయన కూడా క్లైమాక్స్ కి భయపడి ఒప్పుకోలేదు.

అలా ఎంతోమంది యువ హీరోల చుట్టూ తిరిగిన ఈ కథ చివరికి పంజా వైష్ణవ్ తేజ్ వద్దకి చేరింది.చిరంజీవి ఈ కథని విని, కచ్చితంగా ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని నమ్మి, పంజా వైష్ణవ్ తేజ్ ని ఇచ్చాడట.ఇక ఆ తర్వాత ఫలితం ఎలాంటిదో మన కళ్లారా చూసాము.నాని, రాజ్ తరుణ్ లు కాస్త రిస్క్ తీసుకొని ఈ సినిమాని చేసి ఉంటే వాళ్ళ కెరీర్ లోనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా నిలిచి ఉండేది.బ్యాడ్ లక్ అంటే ఇదే.