
Bhadrachalam Seetharamula Kalyanam: భద్రాద్రి రామయ్య కల్యాణంలో ముత్యాల తల్రంబాలు, పట్టు వస్త్రాలను తేవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. తొలుత ఈ సంప్రదా యానికి నైజాం నవాబు తానీషా శ్రీకారం చుట్టారు. అనంతరం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తరువాత తొలినాళ్లలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి లేదా దేవాదాయ శాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలం బ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేవారు. 1973లో అప్పటి ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన జలగం వెంగళరావు పట్టు వస్త్రాలు తెచ్చే సంప్రదాయానికి నాంది పలికారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిం చారు. అనంతరం డా. మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజ య్య, భవనం వెంకటరామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నందమూరి తారక రామారావు,నారా చంద్రబాబునాయు డు, డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తరపున పలుమార్లు ము త్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇందులో చంద్రబాబునాయుడు అందరి కంటే అత్యధికంగా రా మయ్యకు సమర్పించడం విశేషం. కాగా కొన్ని సమయాల్లో అనివార్య పరిస్థితుల కారణంగా ఎన్టీ రామారావు, నారా చంద్రబాబునాయుడు, డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ము త్యాల తల్రంబాలను సమర్పించలేకపోయారు. 2009లో జరిగిన ఎన్నికల సమయంలో నవమి రావడంతో ప్రో టోకాల్ సమస్య కారణంగా అప్పటి రెవెన్యూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వీరభద్రయ్య రాష్ట్ర ప్రభుత్వం త రపున ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా 2015, 2016లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు దంపతులు రామయ్యకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 2017లో అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభు త్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించిన గవర్నరుగా ఆయన రికార్డు సృష్టించారు. 2018 నుంచి 2022 వర కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ ఉన్నారు.

ముత్యాల తలంబ్రాలను 2015,16లో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు.. ఆ తర్వాత ఒకసారి ఆయన మనవడు హిమాన్షు తో రామయ్యకు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అయితే ఈసారి కూడా కేసీఆర్ ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశం లేదు. శ్రీరామ నామ వేడుకలకు ఆయన హాజరు కాకపోవడమే ఎందుకు కారణం. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సతి సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.