Aadhaar Card: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అన్నింటికి ప్రామాణికంగా మారింది. మనిషి జీవన గమనంలో ఆధారే ముఖ్యమని తెలుస్తోంది. మానవ మనుగడకు ఆధార్ కార్డు ఓ ఆయుధంలా కనిపిస్తోంది. బ్యాంకు ఖాతా కావాలన్నా, ప్యాన్ కార్డు తీయాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా అన్నింటికి మూలాధారమే ఆధారే. దీంతో ఆధార్ కార్డుతో మన జీవితం ముడిపడి ఉందని తెలిసిందే. దేశంలో ఎక్కడైనా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఏ పని కావాలన్నా మొదట ఆధార్ కార్డు ఉండాల్సిందే. లేకుంటే ఏ పని కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆధార్ అన్నింటికి ఆధారంగా నిలుస్తోంది.

దేశంలో మొదట మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలో తెంబ్లీ గిరిజన గూడెంలో తొలిసారిగా ఆధార్ కార్డు ప్రవేశపెట్టారు. 2009 జనవరి 10న ప్రారంభమైన ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. తొలి కార్డును రజనా సోనవానే అందుకున్నారు. ఇందులో 16 అంకెల కోడ్ ఉంటుంది. 12 అంకెలతో మన నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ప్రవేశపెడితే మన డేటా అంతా తెలిసిపోతోంది. మనం ఎక్కడి వారం, చిరునామా తదితర వివరాలు అన్ని కనిపిస్తాయి. మనం తీసుకునే రుణాలు మన బ్యాంకు లావాదేవీల కూడా కనిపించడం గమనార్హం.
ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ 1947. గతంలో అన్నింటికి రేషన్ కార్డును చూపేవారు. కానీ ప్రస్తుతం అన్నింటికి ఆధారే ప్రామాణికంగా చెబుతున్నారు. ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చూపించాల్సిందే. దీంతోనే మన గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంకా బ్యాంకు ఖాతాలకు కూడా మన ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తున్నాయి. కొన్ని సెల్ కంపెనీలు కూడా మన ఆధార్ కార్డు నెంబర్ ను తమ కంపెనీతో కలుపుతున్నాయి. దీంతో ఆధార్ కార్డు నెంబర్ తో మన గురించి ఎన్నో విషయాలు బహిర్గతం అవుతున్నాయనడంలో సందేహం లేదు.

ఆధార్ కార్డు ప్రస్తుతం సర్వరోగ నివారణిలా మారింది. ఏ పనికైనా ఆధార్ కార్డు నెంబర్ లేనిదే కావడం లేదు. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు ఆధార్ తోనే ముడిపడి ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఆధార్ కార్డు ను చూపించకుంటే ఏ పని కూడా ముందుకు సాగడం లేదు. స్కూలు ప్రవేశం నుంచి ఐఏఎస్ వరకు అన్ని స్థాయిల్లో ఆధార్ కార్డు నెంబర్ అవసరం ఏర్పడుతోంది. భవిష్యత్ లో ఇంకా అనేక కార్యకలాపాలు ఆధార్ తోనే జరుగుతాయని తెలుస్తోంది. ఆధార్ కార్డు నెంబర్ కు ఉన్న ప్రాధాన్యం అలాంటిది మరి.
Also Read:Mhoni Vidente: మూడో ప్రపంచ యుద్ధం వస్తోందా.. ఆమె చెప్పిన జోస్యం నిజమవుతుందా?