https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నా మజాకా? ఆ ఒక్క మూవీతో 12 రికార్డులు బద్దలు

Pawan Kalyan: తెలుగులో హీరోలందరి కన్నా పవన్ కళ్యాణ్ చాలా వేరు. ఆయనకు ఉన్న డైహార్ట్ ఫ్యాన్స్ వేరే ఎవరికి లేరు. పవన్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా మోస్తారు కలెక్షన్లు వస్తాయి. అశేష అభిమాన గణమే అండగా పవన్ సినిమాలకు అండగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ తన కెరీర్ లో చాలా తక్కువ సినిమాలే చేశారు. కానీ చాలా బ్లాక్ బస్టర్ లు అందుకున్నాు. […]

Written By: , Updated On : January 31, 2022 / 09:06 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: తెలుగులో హీరోలందరి కన్నా పవన్ కళ్యాణ్ చాలా వేరు. ఆయనకు ఉన్న డైహార్ట్ ఫ్యాన్స్ వేరే ఎవరికి లేరు. పవన్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా మోస్తారు కలెక్షన్లు వస్తాయి. అశేష అభిమాన గణమే అండగా పవన్ సినిమాలకు అండగా ఉంటారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ తన కెరీర్ లో చాలా తక్కువ సినిమాలే చేశారు. కానీ చాలా బ్లాక్ బస్టర్ లు అందుకున్నాు. మొత్తం 27 సినిమాలు తీయగా అందులో సగం మాత్రమే హిట్లు.కొన్ని సార్లు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. అలాంటి సమయంలో ఓ సినిమా తనకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎన్నో రికార్డులు సాదించింది.

ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 5 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక పవన్ కు హిట్ రాదు అనుకుంటున్న సమయంలో వచ్చింది ‘జల్సా’ మూవీ. 2008 ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే మంచి టాక్ తెచ్చుకుంది. హిట్ అందుకుంది. ఈ మూవీతో పవన్ పై విమర్శలకు చెక్ పడింది. ఫ్లాప్ లకు బ్రేక్ పడింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో సూపర్ హిట్. పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేపట్టిన సినిమాగా ‘జల్సా’ నిలిచింది. ఈ సినిమా పలు రికార్డులు కొల్లగొట్టింది.

ఆడియో ద్వారానే కోటి రూపాయలు కలెక్ట్ చేసింది జల్సా మూవీ. నైజాంలో రూ.9.10 కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ‘గాల్లో తేలినట్టుందే’ అన్న పాటకు కోటి రూపాయలతో సెట్ వేయడం అప్పట్లో ఇదో రికార్డు. వరల్డ్ వైడ్ గా 1000 స్క్రీన్లలో రిలీజ్ అయిన తొలి మూవీ ‘జల్సా’.

జల్సా మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద సంచలనం. ఇద్దరు స్టార్ హీరోలు దీనికి పాలుపంచుకున్నారు. 282 కేంద్రాల్లో ఈ జల్సా మూవీ 50 రోజులు ఆడింది. ప్రసాద్స్ ఐమాక్స్ లో ఈ మూవీ 85 లక్షలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం ఇదే. ఓవర్సీస్ లో రూ.4 కోట్లు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఇలా జల్సా మూవీ రికార్డులు అప్పట్లో ఓ సంచలనంగా చెప్పొచ్చు.