Marriage Muhurtham 2024: మరో రెండు రోజుల్లో 2023 ముగియనుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాది తమ జీవితం బాగుండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తారు. తల్లిదండ్రులు కూడా పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటుంటారు. ప్రస్తుతం ధనుర్మాసం కొనసాగుతోంది. ఈమాసంలో శుభకార్యాలు చేయరు. మకర సంక్రాంతి తర్వాత ముహూర్తాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 2024లో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి శుభ ఘడియలు ఎప్పుడు ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఏడాది శుభ ముహూర్తాలు ఏయే నెలల్లో ఉన్నాయో చూద్దాం.
జనవరిలో..
మకర సంక్రాంతి రోజుతో ధనుర్మాసం పూర్తి అయిపోతుంది. అప్పటి నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతాయి. జనవరి 16(మంగళవారం), జనవరి 17( బుధవారం), జనవరి 20( శనివారం), జనవరి 21(ఆదివారం), జనవరి 22(సోమవారం), జనవరి 27( శనివారం), జనవరి 28( ఆదివారం), జనవరి 30( మంగళవారం), జనవరి 31(బుధవారం) పెళ్లి చేసుకునేందుకు అనువైన రోజులు.
ఫిబ్రవరిలో..
వసంత రుతువు మొదలు అయ్యేది ఫిబ్రవరిలోనే. ఈ ఏడాది లీప్ ఇయర్ కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చాయి. ఈ నెలలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 4(ఆదివారం), ఫిబ్రవరి 6( మంగళవారం), ఫిబ్రవరి 7( బుధవారం), ఫిబ్రవరి 8( గురువారం), ఫిబ్రవరి 12( సోమవారం), ఫిబ్రవరి 13( మంగళవారం), ఫిబ్రవరి 17( శనివారం), ఫిబ్రవరి 24( శనివారం), ఫిబ్రవరి 25( ఆదివారం), ఫిబ్రవరి 26( సోమవారం), ఫిబ్రవరి 29( గురువారం) శుభ ఘడియలు ఉన్నాయి.
మార్చిలో..
మార్చి నెలలోనూ మంచి ముహూర్తాలు ఉన్నాయి. మార్చి 1(శుక్రవారం), మార్చి 2(శనివారం), మార్చి 3(ఆదివారం), మార్చి 4( సోమవారం), మార్చి 5( మంగళవారం), మార్చి 6(బుధవారం), మార్చి 7(గురువారం), మార్చి 10(ఆదివారం), మార్చి 11(సోమవారం), మార్చి 12( మంగళవారం). వరుసగా రెండు వారాలు శుభ ఘడియలు ఉన్నాయి.
ఏప్రిల్‌లో..
ఎండలు కాస్త ముదిరే సమయం. ఈ నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే శుభ వివాహ తేదీలు ఎప్పుదు వచ్చాయంటే.. ఏప్రిల్ 18( గురువారం), ఏప్రిల్ 19( శుక్రవారం), ఏప్రిల్ 21( ఆదివారం), ఏప్రిల్ 22( సోమవారం). నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. పంచాంగం ప్రకారం 2024 మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభ ముహూర్తాలు లేవు.
జూలైలో..
రెండు నెలల తర్వాత మళ్లీ జూలైలో పెళ్లి చేసుకునేందుకు మంచి సమయం ఉంది. జూలై 9(మంగళవారం), జూలై 11(గురువారం), జూలై 12(శుక్రవారం), జూలై 13(శనివారం), జూలై 14(ఆదివారం), జూలై 15(సోమవారం) ఉన్నాయి. మళ్లీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో శుభ ముహూర్తాలు లేవు.
నవంబర్‌లో..
మళ్లీ రెండు నెలల విరామం తర్వాత పెళ్లి ముహూర్తాలు నవంబర్‌లో ఉన్నాయి. నవంబర్ 12(మంగళవారం), నవంబర్ 13(బుధవారం), నవంబర్ 16(శనివారం), నవంబర్ 17(ఆదివారం), నవంబర్ 18(సోమవారం), సవంబర్ 22(శుక్రవారం), నవంబర్ 23(శనివారం), నవంబర్ 25(సోమవారం), నవంబర్ 26(మంగళవారం), నవంబర్ 28(గురువారం), నవంబర్ 29(శుక్రవారం) మంచి రోజులు.
డిసెంబర్‌లో..
కొత్త సంవత్సరం ఏడాది చివరి నెలలో ఎక్కువ ముహూర్తాలు లేవు. శీతాకాలంలో పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్లు ఈ నెలలో పెళ్లి చేసుకోవచ్చు. డిసెంబర్ 4(బుధవారం), డిసెంబర్ 5(గురువారం), డిసెంబర్ 9(సోమవారం), డిసెంబర్ 10(మంగళవారం) డిసెంబర్ 14(శనివారం)న ముహూర్తాలు ఉన్నాయి.