
Money Remedies: నేటి కాలంలో ఆదాయానికి మించిన అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో జీవిత బండిని ముందుకు నడపడానికి ఆర్థిక వనరులు సరిపోవడం లేదు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరగడంతో ఎంతో కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ అప్పును తీర్చగలమనే శక్తి ఉన్నవారు తీసుకుంటే పర్వాలేదు. కానీ స్థాయికి మంచి అప్పులు చేసి వాటిని తీర్చలేని సమయంలో జీవితం ఛిన్నాభిన్నమవుతుంది. ఒక్కోసారి ఈ ప్రభావం కుటుంబంపై పడి రోడ్డున పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఆర్థిక సూత్రాలను పాటించడం ద్వారా ఇలాంటి సమస్య నుంచి బయటపడొచ్చు. అయితే ఇప్పటికే అప్పులు చేసినవారుంటే వాటి నుంచి బయటపడే మార్గాలున్నాయని అమెరికాకు చెందిన బ్రయన్ ట్రెసీ కొన్ని మార్గాలను సూచించారు. అవేంటో చూద్దాం.
బ్రయన్ ట్రెసీ అమెరికాలో వివిధ సెమినార్లను నిర్వహించారు. ఆయన సమావేశానికి లక్షల మంది హాజరవుతుంటారు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక పరమైన చిక్కులు, వాటిని పరిష్కరించిన విధానాన్ని ఇతరులకు వివరిస్తారు. ఇటీవల ఆయన ‘సైన్స్ ఆఫ్ మనీ’ పేరుతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ప్రతి ఒక్కరు జీవితంలో డబ్బును ఎలా పొదుపు చేయాలి? ఎలా ఖర్చు పెట్టాలి? అనే విషయాలను వివరించారు. అలాగే అప్పుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పడాలి అని చెప్పారు.
అవసరాలకు ఆదాయం సరిపోనప్పుడు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది తప్పు కాదు. అయితే మనకు వచ్చే ఆదాయంతో ఆ అప్పును తీర్చగలమా? లేదా? అనేది ముందుగా నిర్దారించుకోవాలి. ఉదాహరకు ఒక వ్యక్తికి రూ.50 వేల జీతం రాగానే తమ సంపాదన పెరిగిందని అనుకుంటారు. కానీ సంపాదనతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయని గుర్తించాలి. ఇదే సమయంలో అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. జీతి పెరిగినందుకు కొందరు హైఫై లఫ్ కు అలవాటు పడుతారు. ఈ క్రమంలో స్థాయికి మించి వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఎక్కువ ఆదాయం కలిగిన వారు విలాస వస్తువులను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతారు. అయితే ఒక వస్తువును కొనాలని అనుకున్నప్పుడు దానిని 30 రోజుల పాటు వాయిదా వేయాలి. ఆ 30 రోజుల తరువాత కూడా దానినికొనాలని అనిపిస్తే అది మీకు అవసరమున్న వస్తువే అని గుర్తించాలి. ఇలా అనవసరపు ఖర్చులను దూరం చేయడం ద్వారా అనవసర ఖర్చులు ఉండవు. దీంతో మీకు వచ్చే ఆదాయం ఖర్చులకు పోను మిగులుతుంది. ఆ మిగిలిన మొత్తాన్ని పలు రకాలుగా పోదుపు చేయాలి. ఈ పొదుపే భవిష్యత్ లో మిమ్మల్ని కాపాడుతుంది.
చిన్న మొత్తంలో అప్పులు ఉన్నా వలయంలో చిక్కుకున్నట్లే. కొందరు చిన్న అప్పులను తీర్చడానికి పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక అవి తీర్చలేక జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. ఫలితంగా ఆదాయం, ఖర్చలకు కూడా సరిపోకుండా మారుతుంది. అందువల్ల అప్పులు చేసే సమయంలో మనం ఎందుకు చేస్తున్నామో రెండు, మూడుసార్లు చర్చించుకోవాలి. ఆ తరువాత ముందుకు వెళ్లాలి.. అని బ్రయన్ ట్రెసీ తన పుస్తకంలో వివరించారు.