Homeఎంటర్టైన్మెంట్YouTube Telugu Subscribers: తెలుగులో అత్యధికంగా సబ్ స్క్రైబర్స్ ఉన్న చానల్స్ ఇవే..

YouTube Telugu Subscribers: తెలుగులో అత్యధికంగా సబ్ స్క్రైబర్స్ ఉన్న చానల్స్ ఇవే..

YouTube Telugu Subscribers: నేటి కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ కు ప్రధాన ఆదాయ మార్గంగా యూట్యూబ్ ఉంది. వంట, ట్రావెలింగ్, వర్తమాన అంశాలు, కామెడీ, సినిమా, గాసిప్స్, తెర వెనుక సంగతులు, చరిత్ర.. ఇంకా చాలా అంశాలపై యూ ట్యూబ్ లో లక్షలాది చానల్స్ ఉన్నాయి. కేవలం వీటి ద్వారానే కోట్ల ఆదాయాన్ని సంపాదించే వారు కూడా ఉన్నారు. వారు తమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సెలబ్రిటీలుగా మారిపోయారు. యూట్యూబ్ ద్వారా సంపాదిస్తూనే.. సినిమాలలో అవకాశాలు పొందుతున్నారు. రియాల్టీ షోలలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. అయితే తెలుగులో యూట్యూబ్ చానల్స్ ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యధికంగా సబ్ స్క్రైబర్స్ లు కలిగి ఉన్న చానల్స్ కొన్ని మాత్రమే. ఇంతకీ ఆ చానల్స్ ఏమిటో ఒకసారి చూద్దామా..

అత్యధికంగా సబ్ స్క్రైబర్స్ చానల్స్ ఇవే..

హర్ష సాయి ఫర్ యు (Harsha Sai for you)..
10.9 మిలియన్ ఫాలోవర్స్

ఈ ఛానల్ ను 10.9 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. అయితే ఇటీవల హర్ష సాయి పై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ హర్ష సాయికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇతడు పేదవారిని ఆదుకుంటాడని.. వారికి డబ్బులు ఇచ్చి సాయం చేస్తాడని సోషల్ మీడియాలో పేరు ఉంది. తనకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని హర్ష సాయి గతంలో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే అది మధ్యలోనే ఆగిపోయిందని వినికిడి.

ఫిల్మీ మోజీ (Filmy moji)
5.31 మిలియన్ ఫాలోవర్స్

ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ ఛానల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. దీనిని 5.31 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇది కేవలం సినిమా విషయాలు మాత్రమే ప్రసారం చేస్తుంది. ఇందులో కంటెంట్ ఒరిజినల్ గా ఉంటుంది కాబట్టే.. చాలామంది ఈ ఛానల్ ను అనుసరిస్తుంటారు.

షణ్ముఖ్ జస్వంత్ (shanmukh Jaswant)
4.93 మిలియన్ ఫాలోవర్స్

ఈ ఛానల్ ను 4.93 మిలియన్ల మంది అనుసరిస్తుంటారు. ఇతడు గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొన్నాడు. అయితే ఇటీవల ఇతడి పై ఓ యువతి కేసు పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు షణ్ముఖ్ బయట కనిపించలేదు. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు.

ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు (Prasad tech in Telugu)
4.73 మిలియన్ ఫాలోవర్స్

ఈ ఛానల్ ను 4.73 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. టెక్నాలజీకి సంబంధించి ఈ ఛానల్ లో ప్రసాద్ అనేక కొత్త విషయాలను చెబుతుంటాడు. అందువల్లే ఈ ఛానల్ ను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

శ్రావణి కిచెన్ (shravani kitchen)
4.7 మిలియన్ ఫాలోవర్స్

ఈ ఛానల్ ను 4.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. వంటలకు సంబంధించి కొత్త కొత్త విషయాలు.. పురాతన నుంచి నవీన వంటకాల వరకు శ్రావణి తన ఛానల్ ద్వారా వివరిస్తున్నది. ఆమె చెప్పే తీరు కొత్తగా ఉండడంతో అనేకమంది ఈ ఛానల్ ను అనుసరిస్తున్నారు.

బ్యాంకాక్ పిల్ల (Bangkok pilla)
3.61 మిలియన్ ఫాలోవర్స్

బ్యాంకాక్ లో స్థిరపడిన తెలుగు అమ్మాయి ఏర్పాటు చేసిన ఛానల్ ఇది. బ్యాంకాక్ విషయాలతో పాటు.. తన కుటుంబంలో జరిగిన విషయాలను కూడా ఈమె పంచుకుంటుంది. ఆమె చెప్పే తీరు కొత్తగా ఉండడంతో చాలామంది ఈ ఛానల్ ను ఫాలో అవుతున్నారు.

అమ్మ చేతి వంట
3.52 మిలియన్ ఫాలోవర్స్

పూర్తిగా వంటల ఛానల్ అయినప్పటికీ ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అమ్మ తయారు చేసే వంటల గురించి ఈ ఛానల్ లో ప్రముఖంగా చెబుతుంటారు. సంప్రదాయ వంటలను అధునాతన పద్ధతుల్లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంటారు. అందువల్లే ఈ ఛానల్ కు 3.52 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

మై విలేజ్ షో (my village show)
3.1 మిలియన్ ఫాలోవర్స్

ఈ ఛానల్ పూర్తిగా తెలంగాణ మాండలికంలో కొనసాగుతుంది.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో జరిగే సరదా సంభాషణలతో ఆకట్టుకుంటుంది. ఈ విలేజ్ షో ద్వారానే అనిల్ గీలా, గంగవ్వ ఫేమస్ అయ్యారు.. వాళ్ళిద్దరూ ఇప్పుడు బిజీబిజీ ఆర్టిస్టులు అయిపోయారు.

రుహాన్ అర్షద్ అఫీషియల్
2.88 మిలియన్ ఫాలోవర్స్

కేవలం మ్యూజిక్ భాగంలో మాత్రమే ఈ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. ట్రెడిషనల్, వెస్ట్రన్, క్లాసికల్.. ఇలా అనేక రకాలైన మ్యూజిక్ ను యూజర్లకు పరిచయం చేస్తున్నారు. అందువల్లే ఈ ఛానల్ మిలియన్ వ్యూయర్స్ ను సొంతం చేసుకుంది.

అయితే ఇవన్నీ కూడా పర్సనల్ చానల్స్ మాత్రమే.. వీటిల్లో ప్రధాన మీడియాకు మినహాయింపు ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular