Puri Jagannath : సినిమా నిర్మాణం అంటేనే ఆలస్యం.. బాహుబలి తీయడానికి రాజమౌళికి 5 ఏళ్లు పట్టింది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు పట్టింది. ఇక మిగతా దర్శకులదీ అదే దారి. కనీసం ఏడాదైనా తీయకపోతే దర్శకుల నిద్రపట్టదు. అలా అందరు ఆర్టిస్టులను తీసుకొచ్చి పకడ్బందీగా తీయాలంటే ఆ టైం పడుతుందని అందరూ అనుకుంటారు. కానీ దేశంలో అన్న టైంకు సినిమా పూర్తి చేసే ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రమే..

సినిమా పూజా కార్యక్రమాల రోజే ఏకంగా డేట్ ప్రకటించి ఆలోపే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయగల గట్స్ పూరి జగన్నాథ్ సొంతం. ఆయన మహేష్ తో ‘బిజినెస్ మ్యాన్ ను’ కేవలం 45 రోజుల్లోపే పూర్తి చేశాడంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు. నెలరోజుల్లోనూ సినిమా తీయగల సామర్థ్యం పూరి సొంతం.
అంతటి క్రియేటివ్, సూపర్ ఫాస్ట్ దర్శకుడు దేశంలోనే లేడు. లైగర్ విషయంలోనూ అదే జరిగింది. కరోనాతో ఆలస్యమైంది కానీ.. ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది.కాకపోతే ప్యాన్ ఇండియాగా మలచడంతో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో డబ్ చేసేసరికి లేట్ అయ్యింది. అయినా కూడా ముందే అనౌన్స్ చేసిన ఆగస్టు 25వ తేదీకి ఈ సినిమాను పూరి విడుదల చేస్తుండడం ఆయన గట్స్ కు నిదర్శనంగా చెప్పొచ్చు.
అందుకే అంటున్నారు దేశంలోనే పూజా కార్యక్రమాలు అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటించే దమ్ము ధైర్యం గల దర్శకుడు కేవలం మన ‘పూరి’యేనని.. అలాంటి క్వాలిటీ సినిమాను ఎవరూ తీయలేరు అని.. అందుకే పూరి జగన్నాథ్ ను ఇప్పుడు ‘మగాడ్రా బుజ్జీ’ అంటూ సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. లైగర్ సినిమా హిట్ అయితే అటు పూరికి, ఇటు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అంటున్నారు. చూడాలి మరీ..
[…] […]
[…] […]
[…] […]