Vegetarians: శాఖాహారులు అంటే మాసాహారం ముట్టనివారు అని అర్థం. జంతువుల్లో శాఖాహారులు, మాంసాహారులు ఉన్నట్లుగానే మనుషుల్లోనూ శాకాహారులు, మాంసాహారులు ఉన్నారు. అయితే జంతువులకు, మనకు చాలా తేడాలు ఉన్నాయి. శాకాహార జంతువు అంటే జీవితాంతం శాకాహారమే తీసుకుంటుంది. ఇక మాంసాహార జంతువు మాంసమే తీసుకుంటుంది. కానీ మనిషి ఇందుకు భిన్నం. కొందరు శాకాహారం తీసుకుంటే ఇంకొందరు మాంసం, శాకాహారం తీసుకుంటారు. ఇక శాకాహారుల్లో చాలా రకాలు ఉన్నారు. అదెలాగో తెలుసుకుందాం.
8 రకాలు..
శాకాహారుల్లో మన దేశంలో 8 రకాలు ఉన్నట్లు గుర్తించారు. వారు తీసుకునే ఆహారం ఆధారంగా విభజన చేశారు.
1. స్వచ్ఛమైన శాఖాహారి.. వీరు ఎలాంటి మాంసాహారం తీసుకోరు. పూర్తిగా కాయగూరలు, ఆకుకూరలే తింటారు.
2. ఈ శాకాహారులు గుడ్డు తింటారు. కానీ చికన్ తినరు.
3. వీరు కూడా శాకాహారులే.. గుడ్డుతో చేసిన కేక్ తింటారు. కానీ ఆమ్లెట్ తినరు.
4. వీరు వెరైటీ శాకాహారులు చికెన్ గ్రేవీ తింటారు. కానీ చికెన్ ముక్కలు తినరు.
5. ఈ రకం శాకాహారులు నాన్‌వెజ్ బయట తింటారు. ఇంట్లో మాత్రం వండరు, తినరు.
6. ఈ రంక శాకాహారులు ఎప్పుడు తాగుతారో అప్పుడే తింటారు. మద్యం తాగనప్పుడు మాంసం ముట్టరు.
7. ఈ రకం శాకాహారులు జనరల్‌గా తినరు. కానీ పక్కన ఉన్నవారు ఫోర్స్ చేస్తే తింటారు.
8. శాకాహారుల్లో నిజాయతీ పరులైన శాకాహారులు వీరు. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నాన్‌వెజ్ తింటారు, సోమవారం, మంగళవారం తినరు.