Diseases : కరోనా మహమ్మారితో ప్రపంచం మూడేళ్లు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో చాలా వ్యవస్థలు కుప్ప కూలాయి. లక్షల మంది వైరస్‌బారిన పడి మృతిచెందారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోలేదు. దీంతో కరోనాతో కలిసి జీవించడం అలవాటు అయింది. వ్యాక్సిన్ కారణంగా వైరస్ తీవ్రత కూడా తగ్గింది. అయితే కరోనా కన్నా డేంజన్ వ్యాధులు ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వైరస్ కావడంతో ప్రపంచం వణికిపోయింది. కానీ, ఇతర వ్యాధులతో కరోనాకన్నా ఎక్కువ మంది ఏటా చనిపోతున్నారు. వైద్య వ్యవస్థం ఎంతో అభివృద్ధి చెందినా.. వ్యాధులు కూడా అంతకు మించి పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి కారణంగా రానున్న రోజుల్లో మరిన్ని వ్యాధులు ముసురుకునే అవకాశం ఉంది.
2026 మరణాల ఆధారంగా..
రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రమాదాలు కూడా పెరుగతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీబీ, ఎయిడ్స్ వంటి వాటితో మరణాలు బాగా తగ్గాయి. కానీ, అల్జీమర్స్, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ కారణంగా మరణాలు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది. 2016లో నమోదైన మరనాలకు కారణాలను పరిశీలించడంతోపాటు 2040లో మరణాలకు కారణమయ్యే 20 ప్రధాన అంశాలను అంచనా వేసింది.
ప్రమాదకరంగా వ్యాధులు..
రాబోయే 20 ఏళ్లలో గుండె జబ్బులు మరింత పెరుగతాయి. షుగర్ బాధితులు మరింత పెరుగుతారు. వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతాయి. ఈ మూడు వ్యాధుల కారణంగా 2040 నాటికి మరణాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయన నివేదిక ఫలితాలు సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.