
Wife and Huband : దంపతులంటే ఆహా ఎంత చక్కగా ఉన్నారురా అని అనిపించుకోవాలి. అంతేగాని పబ్లిక్‌లో పిచ్చి వేషాలు, రొమాన్సులు, పిచ్చి స్టంట్లు వంటివి చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇంట్లో ఎన్ని వేషాలు వేసినా ఎవరూ అడగరు. బయట బాధ్యతగా ఉండాలి. లేకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఓ జంట బైక్‌పై వెళ్తూ పాడుపని చేశారు. తమ ముందు పిల్లాడు ఉన్న సంగతి మర్చిపోయారు.
అంత గాలేకపోయారా…
ఈ మధ్య కొంతమంది దంపతులు తాము ఉన్నది సమాజంలో అన్న సంగతి మర్చిపోయి శృతి మించి ప్రవర్తిస్తున్నారు. బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ప్రియుడి ఒడిలో కూర్చుని మరీ ప్రియురాలు ముద్దులతో రెచ్చిపోవడం వంటి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లవర్స్ మాత్రమే కాదు, పెళ్లైన వారు కూడా హద్దులు మీరుతున్నారు. తప్పు, ఒప్పు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు బైక్ మీద వెళ్తూ పాడుపని చేశారు. అది ముందు పిల్లవాడు ఉండగానే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిగరెట్ తాగడంలో సాయం..
భార్య అంటే ఎలా ఉంటుంది అని అంటే.. మద్యం తాగితే తిట్టేది, సిగరెట్ తాగితే కొట్టేది అని చెబుతారు. మద్యం, సిగరెట్ తాగిన భర్తను కొట్టని భార్య భార్యే కాదు అని మన సమాజం అంటుంది. కానీ భర్తతోపాటు మద్యం, సిగరెట్ తాగే భార్యలు ఉన్నారు.. ఆ ముచ్చట వేరే. కానీ మరీ భర్తకు దగ్గరుండి మద్యం పోసి, సిగరెట్ తాగించే భార్యలు ఉంటారా? అంటే ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తుంది. ఓ ఇల్లాలు బైక్ మీద వెళ్తుండగా తన భర్తకు సిగరెట్ తాగడంలో సహాయం చేస్తుంది. ‘మీరెందుకండి శ్రమ పడతారు. నేనున్నా కదా’ అని సిగరెట్ నోటిలో పెట్టి భర్తకు పని తగ్గిస్తుంది. అబ్బా ఎంత మంచి భార్య అని గుప్పు గుప్పు మంటూ పొగ తాగి బయటకు వదులుతున్నాడు ఆ పతిశ్రీ. అయితే ఈ బైక్ మీద వారితోపాటు వారి బిడ్డ కూడా ఉన్నాడు. ఈ వీడియోని ఒక నెటిజన్ షేర్ చేస్తూ.. ఇలాంటి భార్య కావాలి అంటూ క్యాప్షన్ పెట్టాడు.
మండిపడుతున్న నెటిజన్స్..
భర్తకు సిగరెట్ తాగడంలో సాయం చేస్తున్న భార్య వీడియోను చూసి నెటిజన్స్ మండిపడుతున్నారు. భార్య అంటే ఎలా ఉండాలి. భర్త మద్యం తాగితే తిట్టాలి, సిగరెట్ తాగితే పాడైపోతాయని కొట్టాలి. అంతేగాని దగ్గరుండి లివరు, లంగ్సు చెడగొడతారా? ఇదెక్కడి చోద్యం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది పిల్లాడి ముందు సిగరెట్ తాగడం ఏంటి? దాన్ని భార్య సమర్ధించడం ఏమిటి అని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు తలకు హెల్మెట్ లేకుండా ఎలా బైక్ నడుపుతారు అంటూ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడమే నేరం అనుకుంటే.. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగడం ఇంకా పెద్ద నేరమని.. వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
View this post on Instagram