
Rajamouli Villains: తెలుగు సినిమా నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మగధీర సినిమాతో జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి ఉంది,భవిష్యత్తులో సినీ ప్రపంచాన్ని శాసించబోతుంది అనే సంకేతం ని పంపించాడు. ఆ తర్వాత ఆయన తీసిన బాహుబలి సిరీస్ మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుమూలల విస్తరింప చేసి, త్వరలో పాన్ వరల్డ్ సాక్షిగా చిత్ర పరిశ్రమని తెలుగు సినిమా ఏలబోతుంది అని నిరూపించేలా చేసింది.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన #RRR చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆస్కార్ అవార్డు ని గెలుచుకొని తెలుగోడి సత్తా ఏంటో చూపించింది.ఇన్ని చేసిన రాజమౌళి లో ఒక బలహీనత ఉంది, అదే కామం. లెజండరీ డైరెక్టర్ ని పట్టుకొని కామాందుడు అంటున్నాడు ఏంటి అని అనుకోకండి. ఆయన సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కువగా కామం తో నిండినవే.

ఆయన సినిమాల్లోని విలన్స్ ని చూస్తూ ఉంటే ఇంత కామం తో నిండిన క్యారెక్టర్స్ ని రాజమౌళి ఎలా డిజైన్ చేసాడు అని ఆశ్చర్యపోక తప్పదు.మొదటి సినిమా నుండి బాహుబలి వరకు 90 % శాతం రాజమౌళి సినిమా విలన్స్ కామం తో రగిలిపోతుంటారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో కూడా కామం తో ఉన్న విలన్ హీరోయిన్ పై బలవంతం చేయబోతే హీరో వచ్చి అతనిని కొట్టడం తో అతను చనిపోతాడు.ఆ తర్వాత హీరో ఎన్ని ఇబ్బందులకు గురి అవుతాడో మన అందరికీ తెలిసిందే.ఇక సింహాద్రి సినిమా లో కూడా ఇంతే,ఇందులో ఎన్టీఆర్ అక్క ని విలన్ బ్రా సైజు అడుగుతాడు, అలా అడిగినందుకు కోపం తో విలన్ హీరో అక్కని చంపేస్తాడు, దాంతో ఎన్టీఆర్ విలన్స్ భరతం పట్టి సింగమలై గా మారిపోతాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు, మగధీర వంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ ఎంత కామం తో రగిపోతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,అందరికీ తెలిసిందే.ఇలా రాజమౌళి సినిమాల్లో తన కామం యాంగిల్ ని విలన్ క్యారెక్టర్స్ రూపం లో చూపించుకుంటాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.