Unstoppable With Nbk- Prabhas: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ ‘ప్రభాస్ ఎపిసోడ్ ఒక రోజు ముందే..అనగా ఈరోజు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అయ్యింది..ఎప్పుడైతే ఆహా మీడియా వారు ఇది అప్లోడ్ చేసారో,లక్షలాది మంది ప్రభాస్ ఫ్యాన్స్ మరియు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వీక్షకులు ఆహా యాప్ ని ఓపెన్ చేసారు..అంతే దెబ్బకి కెపాసిటీ దాటిపోయి ఆహా యాప్ క్రాష్ అయ్యింది.

దీనితో ఆహా మీడియా టీం వారు ‘ప్రభాస్ అభిమానుల తాకిడి కి మా యాప్ క్రాష్ అయ్యింది..సరి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము..కాస్త వేచి ఉండండి’ అంటూ ఒక ట్వీట్ వేసింది..ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది..ఎప్పటి లోపు ఈ సమస్య ఫిక్స్ చేస్తారో తెలీదు కానీ అభిమానుల ఆగ్రహం మాత్రం కట్టలు తెంచేసుకుంది..ఆహా మీడియా ని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ బండబూతులు తిట్టేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ షో కి వస్తున్నపుడు ముందుగా అన్నీ చూసుకోవాలి..ఇలాంటివి జరుగుతాయని ముందుగా అంచనా వెయ్యని మీకు ఎందుకు ఇలాంటి బిగ్గెస్ట్ టాక్ షోస్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆహా మీడియా పై విరుచుకుపడుతున్నారు..మరోపక్క కొంతమంది ఫ్యాన్స్ ‘ఇంతమంది సెలెబ్రిటీలు వచ్చారు..ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు..అలాంటిది ప్రభాస్ కి జరిగిందంటే ఆయనకీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు..మరోపక్క పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది..ఈ ఎపిసోడ్ కి ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు..అయితే ప్రభాస్ ఎపిసోడ్ కి ఇలా జరిగింది కాబట్టి ఆహా సర్వర్ కెపాసిటీ బాగా పెంచుతారని..కాబట్టి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఆ కెపాసిటీ ని తట్టుకోగలదు అంటూ అభిమానులు చెప్తున్నారు.