Homeఆంధ్రప్రదేశ్‌TDP- MLC Election: ఆ విమర్శలపై టీడీపి దృష్టి.. నష్ట నివారణ చర్యలకు సిద్ధం

TDP- MLC Election: ఆ విమర్శలపై టీడీపి దృష్టి.. నష్ట నివారణ చర్యలకు సిద్ధం

TDP- MLC Election
TDP- MLC Election

TDP- MLC Election: అధికార పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిందన్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ ధీటుగానే సమాధానం ఇస్తోంది. విమర్శలకు సమాధానం ఇస్తూనే.. మరోపక్క ఈ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు టిడిపి అధిష్టానం సిద్ధమవుతోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ పెట్టాలన్న ఆలోచన చేయని తెలుగుదేశం పార్టీ.. చివరి నిమిషంలో అభ్యర్థిని బరిలోకి దించి ఏకంగా విజయం సాధించింది. ఈ అధికార పార్టీకి ఏమాత్రం మింగుడు పడని అంశం. ఏడో ఎమ్మెల్సీ సీటును గెలిపించుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులను ఒడ్డింది. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు చేజారి పోకుండా సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఒక్క ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఏడో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని అధికార పార్టీ అభిమానుల వ్యక్తం చేసింది.

ఓటమితో సరికొత్త పల్లవి..

ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ముందు నుంచి అసంతృప్తిగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైలెంట్ గా టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో ఎమ్మెల్సీగా ఆమె విజయం సాధించింది. అనుకోని రీతిలో టిడిపి అభ్యర్థి విజయం సాధించడంతో వైసీపీ అగ్ర నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఓటమని తమ ఫెయిల్యూర్ గా కాకుండా.. తెలుగుదేశం పార్టీ ప్రలోభాల వలన లభించిన విజయం గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేశారని తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పించారు. దీనిని తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.

కొనుగోలులో సిద్ధహస్తుడు చంద్రబాబు..

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అనే ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్ పక్కనున్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎం సీటు కొట్టేసారని, తెలంగాణలో ఎమ్మెల్సీ సీటు కోసం ఒక ఎమ్మెల్యేకు ఐదు కోట్లు ఇస్తూ పట్టుబడి హైదరబాద్ నుంచి రాత్రికి రాత్రి విజయవాడకు పారిపోయి ఇచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తోంది. గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఇలాగే కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు కూడా అప్పగించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

అలర్ట్ అయిన టిడిపి..

ఎమ్మెల్సీగా పంచమర్తి అనురాధ గెలిచిన తర్వాత రాజకీయ వ్యూహం, చతురత టిడిపి నేతలు పెద్ద ఎత్తున మాట్లాడారు. అయితే వైసిపి ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి ఎమ్మల్యేలను కోనుగోలు చేశారన్న అంశాన్ని తీసుకెళుతుండడంతో టీడీపీ అప్రమత్తమైంది. ప్రజల్లోకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో దీనిపై ముందుగా చెప్పిన దానికంటే ఇప్పుడు భిన్నంగా చెబుతూ టిడిపి నాయకులు మాట్లాడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థికి 23 ఓట్లు పడ్డాయని, తమకు అసెంబ్లీలో 23 మంది సభ్యులు ఉన్నారని టిడిపి చెబుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని, మా పార్టీ ఎమ్మెల్యేలే అభ్యర్థిని గెలిపించారని చూస్తున్నారు. దీంతో వైసిపి నేతలు చేస్తున్న కొనుగోలు విమర్శలకు టిడిపి నేతలు చెబుతున్నట్టు అయింది.

TDP- MLC Election
TDP- MLC Election

టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయలేదు..

తెలుగుదేశం పార్టీ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ చేర్చుకుందని విమర్శలు చేస్తోంది. వీరిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్న ప్రశ్న వైసీపీ నుంచి ఎదురవుతోంది. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలను టిడిపి ఎలా తమకు అనుకూలంగా మాట్లాడిస్తుందో, అలానే వైసిపి టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకొని మాట్లాడిస్తుంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించడం నైతికత..? అనైతికత చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అదే సమయంలో పార్టీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు విమర్శలు చేసేలా టిడిపి ప్రోత్సహించడాన్ని, చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో అదే పార్టీని వైసీపీ తిట్టించడాన్ని సమర్ధించడం లేదు. అయితే, ఇక్కడే నైతికత అనే ప్రశ్న ఇరు పార్టీలకు వర్తిస్తోంది.

Exit mobile version