https://oktelugu.com/

Sudheer -Rashmi : సుధీర్-రష్మీ ప్రేమ.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఇలా చూసి తీరాల్సిందే..

Sudheer -Rashmi :  బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జోడి యాంకర్ రష్మీ-జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ దే. వీరిమధ్య ఏముందో కానీ ఆ కెమిస్ట్రీ ఎప్పుడూ పండుతుంది. రష్మీ ప్రేమ తపన ఆమె కళ్లల్లో కనిపిస్తుంది. సుధీర్ పడే ఆరాటం అతడి మోములో మనందరికీ తెలుస్తుంది. అందుకే ఈటీవీ అయినా ఇప్పుడు మాటీవీ అయినా వీరిద్దరి ప్రేమకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. తాజాగా హోలీ పండుగ సందర్భంగా మాటీవీ రిలీజ్ చేసిన ఒక ప్రోమో ఇప్పుడు అందరినీ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2022 / 07:46 PM IST
    Follow us on

    Sudheer -Rashmi :  బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జోడి యాంకర్ రష్మీ-జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ దే. వీరిమధ్య ఏముందో కానీ ఆ కెమిస్ట్రీ ఎప్పుడూ పండుతుంది. రష్మీ ప్రేమ తపన ఆమె కళ్లల్లో కనిపిస్తుంది. సుధీర్ పడే ఆరాటం అతడి మోములో మనందరికీ తెలుస్తుంది. అందుకే ఈటీవీ అయినా ఇప్పుడు మాటీవీ అయినా వీరిద్దరి ప్రేమకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే.

    Sudheer, Rashmi

    తాజాగా హోలీ పండుగ సందర్భంగా మాటీవీ రిలీజ్ చేసిన ఒక ప్రోమో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇన్నాళ్లు ఈటీవీకే పరిమితైన రష్మీ-సుధీర్ జంట తొలిసారి మరో స్టార్ చానెల్ మాటీవీలో దర్శనమిచ్చారు. జబర్ధస్త్ నిర్వహించే ‘మల్లెమాల’ ఎంటర్ టైన్ మెంట్ లో ఒక్కసారి చేరాక ఇతర షోలు చేయడానికి వీలుండదని.. భారీగా అగ్రిమెంట్ చేసుకుంటారని.. ఉల్లంఘిస్తే లక్షలు కట్టాలని నిబంధనలు ఉంటాయని బుల్లితెరపై ఓ టాక్ ఉంది. అలానే బిగ్ బాస్ కోసం ముక్కు అవినాష్ ఏకంగా రూ.10 లక్షలు కట్టి మరీ బిగ్ బాస్ వదిలివచ్చాడంటారు.

    Also Read: KTR : హతవిధీ.. క్రేన్ కు కట్టి పెట్టినా కేటీఆర్ కరుణించలేదే?

    కానీ ఇప్పుడు సుధీర్-రష్మీ తొలిసారి ఈటీవీ-మల్లెమాల వదిలేసి మాటీవీలో సందడి చేశారు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే వీరి అగ్రిమెంట్ మల్లెమాలతో ముగిసిందని.. అందుకే ఆ చానెల్ వీడి ఇక స్వేచ్ఛగా బయట కార్యక్రమాలు చేయబోతున్నారని తెలిసింది.

    ఇదంతా పక్కనపెడితే మాటీవీలోనూ హోలీ వేడుకకు యాంకర్ గా రష్మీ వచ్చింది. మధ్యలో సర్ ప్రైజ్ గా సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు.వీరిద్దరి మధ్య సాగిన ప్రేమలు, ఆప్యాయతలు.. ఓ సారి కొట్లాటను బయటపెట్టారు. వారి ప్రేమ ఊసులు పంచుకున్నారు. వారి కళ్లలో ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో ఈ వీడియో తేటతెల్లం చేసింది. నిజంగా సుధీర్-రష్మీ జోడీ ఎవర్ గ్రీన్ అని మరోసారి ప్రేక్షకులకు చవిచూపించింది. వీరిది నిజమైన ప్రేమనో లేక నటిస్తున్నారో వాళ్లకే తెలుసు. కానీ వారి స్వచ్ఛమైన ప్రేమ భావన మాత్రం ప్రేక్షకులను ఎప్పుడూ ఫిదా చేస్తూనే ఉంటుంది. మీరూ ఈ వీడియోను చూసి తన్మయత్వం చెందండి.

    Also Read: Chandrababu- Mamata Banerjee: చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?