Pushpa Official Trailer : అనసూయ అంటే అందం.. చందం.. ముగ్ధమనోహర రూపం.. నవ్వితే చిలిపిదనం.. చలాకీదనం.. అలాంటి అనసూయను ఎవ్వరైనా ఫేడ్ అవుట్ అయిన ఊరమాస్ పాత్రలో చూపిస్తారా? అది జుట్టు కట్ చేసుకొని.. వడ్డీలకు తిప్పే ఒక మాస్ మసాలా పాత్రలో డీగ్లామర్ లో చూపిస్తే అభిమానులు తట్టుకుంటారా? అంటే కష్టమే..
anasuya sunil
కానీ తెరపై పాత్రలను మాత్రమే కనిపించేలా చేసే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అలాంటి అద్భుతమే తాజాగా చేశాడని చెప్పొచ్చు. అందమైన అనసూయన డీ గ్లామర్ పాత్రలో ఒక గయ్యాలీ గంగమ్మగా చూపించాడని తాజాగా విడుదలైన పుష్ప ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక కమెడియన్ సునీల్ ను చూస్తేనే నవ్వొస్తుంది. కానీ అతడిని సగం బట్టతలగా మార్చేసి సీరియస్ పాత్రలో చూపించిన వైనం సుకుమార్ కే చెల్లింది. దీన్ని బట్టి ఇద్దరు సరదా నటులను పుష్ప మూవీలో సీరియస్ పాత్రల్లో ఒదిగిపోయేలా చేశాడని తెలుస్తోంది.
Also Read: Pushpa Movie: “పుష్ప” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా రాబోతుంది ఎవరంటే…
అనసూయ, సునీల్ లను చూస్తేనే ఎలానో ఉన్నారు. మరి పుష్ప లో వీరు పోశించిన పాత్రలేంటి? ఎలా కనిపించబోతున్నారు? వీరు పాత్రలు చూస్తేనే ప్రేక్షకులకు షాక్ అయ్యేలా ఉన్నారు. మరి తెరపై ఎలా కనిపిస్తారన్నది వేచిచూడాలి.
Also Read: ‘‘చిరంజీవి కనిపించకుండా నటించండి.. అది చూడాలనుంది..’’ మెగాస్టార్ కు ఘాటు లేఖ సంచలనం
పుష్ప ట్రైలర్