https://oktelugu.com/

Rishab Shetty Marriage: ఫేస్‌బుక్‌లో చాట్ చేసి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..

Rishab Shetty Marriage: కన్నడ సినిమా ‘కాంతారా’ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. అనుకున్నవాటి కంటే రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమా కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది. దీంతో ‘కాంతారా’ సినిమా డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి గురించి వరల్డ్ లెవల్లో చర్చించుకుంటున్నారు. కొందరు ఇతర ఇండస్ట్రీల నిర్మాతలు రిషబ్ శెట్టితో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ పర్సనల్ […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : October 29, 2022 / 01:38 PM IST
    Follow us on

    Rishab Shetty Marriage: కన్నడ సినిమా ‘కాంతారా’ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. అనుకున్నవాటి కంటే రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమా కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది. దీంతో ‘కాంతారా’ సినిమా డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి గురించి వరల్డ్ లెవల్లో చర్చించుకుంటున్నారు. కొందరు ఇతర ఇండస్ట్రీల నిర్మాతలు రిషబ్ శెట్టితో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిషబ్ 2017లో ప్రగతి శెట్టిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగే ముందు కొన్ని ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం.

    Rishab Shetty Marriage

    రిషబ్ శెట్టి 2016లో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ సినిమా ఈవెంట్ కు ప్రగతి శెట్టి హాజరైంది. ఇక్కడే ప్రగతి శెట్టిని చూశాడు రిషబ్ శెట్టి. ఆ తరువాత చూసీ చూడనట్లుగా వదిలేశాడు. అయితే ఆ తరువాత ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ప్రగతి రిక్వెస్ట్ పంపినట్లు మెసేజ్ వచ్చింది. అంతకుముందే ప్రగతి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసింది. కానీ కొన్ని పనుల వల్ల అది చూసుకోలేదు. ఈసారి ఆమె రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. ఆ తరువాత ప్రగతితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు.

    ఇలా కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసిన తరువాత వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత ప్రేమికులుగా మారారు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి ప్రగతి బంధువులు ఒప్పుకోలేదు. ఎందుకంటే రిషబ్ శెట్టి ఇంకా ఆ సమయంలో లైఫ్లో సెటిల్ కాలేదు. కానీ ప్రగతి మాత్రం పట్టుబట్టి మరీ రిషబ్ శెట్టిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 2017లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    Rishab Shetty Marriage

    రిషబ్ శెట్టి దంపతులిద్దరూ ‘కాంతారా’ సినిమాలో కనిపించారు. ఇందులో హీరో రిషబ్ శెట్టి కాగా.. ప్రగతి కూడా ఓ పాత్రలో కనిపిస్తుంది. ఇలా వీరు అన్యన్యంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రిషబ్ లవ్ స్టోరీ గురించి తెలియగానే నెటిజన్లు వీరి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా పెళ్లి చేసుకున్న ఈ జంట కలకాలం కలిసుండాలని కోరుకుంటున్నారు.

    Tags