
Bangalore: గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవొద్దు.. ఇది పోకిరి సినిమాలోని డైలాగ్. ఇదే సీన్‌ను రిపీట్ చేశాడు ఓ సబ్ ఇన్‌స్పెక్టర్. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటున్న స్నేహితుల కేసులో పోలీసుల ముందు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ఓ మహిళ వెళ్లింది. ఆమె నడుము నాజూగ్గా ఉందని ఎస్సైగారి మొగలిపొద రగిలింది. అంతే పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని కూడా ఆలోచించకుండా ఆ మహిళ నడుం మీద చేతులు వేసి గిల్లేశాడు. స్టేషన్‌కు వచ్చిన మహిళలను చూసి కామంతో రగిలిపోతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు.
బెంగళూరులో ఘటన..
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న దంపతులు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వడానికి బెంగళూరలో నివాసం ఉంటున్న మహిళ సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. సుద్దగంటపాళ్య పోలీస్ స్టేషన్‌లో మంజునాథ్ అనే వ్యక్తి ఎస్సైగా ఉద్యోగం చేస్తున్నాడు. మహిళ అందచందాలు చూసిన మంజునాథ్ సొల్లు కార్చుకున్నాడు. మల్లెపువ్వు తీగలాంటి సన్నటి ఆమె నడుం చూసిన కామంతో తట్టుకోలేకపోయాడు. ఎర్రగా, పొడవుగా, నాజుకుగా ఉన్న మహిళను చూసిన ఎస్సై అతని కుర్చిలో నుంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లాడు. స్టేట్‌మెంట్ తీసుకోకుండా మొదట ఆమె నడుం మీద చేతులు వేసి ఆమె నడుం గిల్లేశాడు. ఆమె శరీరం మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్సై చేష్టలతో విసిగిపోయిన మహిళ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయింది.
ఫోన్‌లో వేధింపులు..
అర్దరాత్రి మహిళ వాట్సాప్ నంబర్‌కు అసభ్యంగా మెసేజ్‌లు పంపించిన మంజునాథ్ ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడని తెలిసింది. ఎస్సై తీరుతో విసిగిపోయిన మహిళ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ట్విట్టర్ అకౌంట్‌లో జరిగిన మ్యాటర్ మొత్తం వివరించి పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్‌రెడ్డి సీరియస్ అయ్యి ఏసీపీ ర్యాంక్ అధికారితో విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని బాధితురాలికి సూచించారు. బుధవారం సాయంత్రం బాధితురాలు సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్‌కు మంజునాథ్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి కేసు పెట్టింది.

సస్పెన్షన్ వేటు..
పోలీసు అధికారుల విచారణలో ఎస్సై మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగు చూడటంతో బెంగళూరు పోలీసు కమీనర్ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు మంజునాథ్‌ని సస్పెండ్ చేశామని డీసీపీ సీకే బాబా తెలిపారు. ఎస్సైని ఇంటికి పంపించిన బెంగళూరు పోలీసు అధికారులు మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళలతో ఎస్సై మంజునాథ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.