Clean River : భారతదేశంలో నదులను ఎంతో పవిత్రంగా చూస్తారు. వీటికి 12 ఏళ్లకి ఒకసారి పుష్కరాలు కూడా చేస్తుంటారు. వీటి ద్వారా కొన్ని ప్రాంతాలకు తాగునీరు లభిస్తుంది. అయితే మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. వీటిని పూజించడం మాత్రమే కాకుండా పంటలకు అన్నింటికి కూడా ఉపయోగపడుతుంటాయి. సాధారణంగా సముద్రాలు, నదులు అనేవి ఎక్కడైనా కూడా శుభ్రంగా ఉండవు. వీటిలో ఎక్కువగా కాలుష్యమైనవే ఉంటాయి. ప్లాస్టిక్ చెత్తా, చెదారం వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే నదుల్లో నీరు స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు వాటిని పాడు చేస్తున్నారు. అక్కడికి టూర్ అని వెళ్లి ఎక్కువగా తాగడం, తిన్నవి అన్ని కూడా అందులో వేసేస్తారు. వీటికి ఆ నదులు బాగా పాడవుతాయి. అయినా కూడా భారతదేశంలో ఎన్నో నదులు వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతికి బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా గంగా, యమునా, బ్రహ్మపుత్ర, గోదావరి వంటి ప్రధాన నదులు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మన దేశంలో ఓ నది మాత్రం చాలా శుభ్రంగా ఉంటుంది. అసలు ఇందులో ఎలాంటి చెత్త లేకుండా చాలా పరిశుభ్రంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ నది ఏదో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
భారతదేశం దాని వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతికి ముఖ్యమైన నదుల విస్తృత నెట్‌వర్క్‌కు నిలయం. గంగా, యమునా, బ్రహ్మపుత్ర మరియు గోదావరి వంటి ప్రధాన నదులు ప్రజల జీవితాలను ఆదుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
భారతదేశంలో డాగి అనే నది అత్యంత పరిశుభ్రమైనది. దీన్ని ఉమ్గోట్ నది అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయలో ఉంటుంది. స్పటిక, స్పష్టమైన నీటికి ఈ నది బాగా ప్రసిద్ధి చెందింది. ఈ నదిని చూడటానికి వెళ్లిన వారు దానికి నచ్చేస్తారు. ఇక్కడికి వెళ్లే పర్యాటకులకు కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తుంది. దీని సహజ సౌందర్యం, నిర్మలమైన వాతావరణ, సహజమైన స్థితి శుభ్రంగా మారేలా చేసింది. ప్రపంచంలోని పరిశుభ్రమైన నదులలో ఒకటిగా నిలిచింది. ఈ ఉమ్గోట్ నది భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని డాకి అనే చిన్న పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఆ తర్వాత మేఘాలయలోని ఖాసీ కొండలు, జైంతియా కొండల మధ్య సహజ విభజనగా పనిచేస్తుంది. ఉమ్‌గోట్ నది మూడు ప్రధాన పర్యాటక ప్రదేశాల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి దాని చుట్టూ కూడా పర్యాటకులు చూడగలిగే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ సాంప్రదాయ సస్పెన్షన్ వంతెనకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే చెత్త ఇందులోకి వెళ్లకుండా జాగ్రత్త వహిస్తారు. మానవ వ్యర్థాలు లేదా నివాస చెత్త దానిని కలుషితం చేయదు. మైనింగ్ కార్యకలాపాల నుంచి ఎటువంటి హానికరమైన రసాయనాలు నదిలోకి ప్రవహించవు. స్థానిక గ్రామస్తులు కూడా నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటారు. ఈ నదిని తాగునీరుగా కొన్ని గ్రామాల వారు వాడుతుంటారు. అందుకే ఈ నదిని కలుషితం చేయరు. ప్రతీ ఒక్కరూ కూడా ఈ నదిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.