Sirisha Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు. నిందితుడు ఎవరో చెప్పేసరికి శిరీష కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేకాదు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. కేసు వివరాలు చెప్పిన అనంతరం నిందితుడిని పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి, జైలుకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంచలనం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శిరీష (18) ఈనెల 11న దారుణ హత్యకు గురైంది. గ్రామ శివారులోని ఓ నీటి కుంటలో శవమై కనిపించింది. మృతురాలి కళ్ళలో గాయాలు ఉండడంతో ఎవరో హత్య చేశారని భావించి, శిరీష సోదరుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు విచారణ ప్రారంభించారు. అయితే మొదటి నుంచి ఈ కేసులో శిరీష బావ ఎర్రగడ్డ పల్లి అనిల్ పై పోలీసులకు ఎందుకనో అనుమానం ఏర్పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగానే అతడు నేనే శిరీషను హత్య చేశానని ఒప్పుకున్నాడు. తన మరదలు శిరీషను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలన్న కోరిక ఉండేదని, కానీ తనను పట్టించుకోకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని పోలీసుల విచారణలో తెలిపాడు. శిరీష వికారాబాద్ లో ఉంటూ నర్సింగ్ కోర్సు చేసేదని, ఆమె తల్లికి బాగా లేకపోవడంతో హైదరాబాద్ తీసుకెళ్లారని, దీంతో తన మరదలు సంతూర్ కి వచ్చిందని అనిల్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు
గొడవ జరగడంతో..
శిరీష తల్లికి ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్లో చేర్పించారు.. ఆమెను చూసుకోవడానికి అనిల్ భార్య వెళ్ళింది.. ఇంట్లో కుటుంబ సభ్యులకు వంట వండి పెట్టేందుకు శిరీష ఈనెల పదిన స్వగ్రామానికి వచ్చింది. వంట వండే విషయంలో తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ తో శిరీష గొడవ పడింది. దీంతో శ్రీనివాస్ తన బావైన అనిల్ కి ఫోన్ చేసి శిరీష వంట చేయడం లేదని చెప్పాడు. పరిగి లో ఉన్న అనిల్ వెంటనే కాల్లాపూర్ గ్రామానికి వచ్చి మరదలు శిరీషను మందలించాడు. ఈ అవమానభారం తట్టుకోలేక ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంటి ప్రధాన తలుపుకు బయటనుంచి గడియ పెట్టి వెళ్లిపోయింది. దీంతో శిరీష కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తమ్ముడు శ్రీనివాస్ భావన అనిల్ కి ఫోన్ చేసి చెప్పడంతో.. అతడు తన భార్యను తీసుకొని అత్తగారు ఊరైన కాల్లాపూర్ కు వచ్చాడు. అక్కడ ఆమెను దిగబెట్టి బైక్ మీద పరిగి వెళ్లిపోయాడు.. అక్కడ మద్యం తాగి తిరిగి కాల్లాపూర్ వెళ్తుండగా గ్రామ సమీపంలో గోనె మైసమ్మ గుడి వద్ద మరదలు శిరీష కనిపించింది.
మాటా మాటా పెరిగి..
ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నామని శిరీషను అనిల్ ప్రశ్నించాడు. అతడి పొడ అంటేనే గిట్టని శిరీష తిట్టింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. మద్యం మత్తులో అనిల్ కోపం తట్టుకోలేక అక్కడే ఉన్న పగలగొట్టి శిరీష కళ్ళల్లో పొడిచాడు.. పక్కనే ఉన్న నీటి కుంట దగ్గరికి తీసుకెళ్లి అందులో ముంచి నుంచి చంపేశాడు. చనిపోయిందనుకొని నిర్ధారించుకొని అక్కడి నుంచి పరిగి వెళ్ళాడు.. తర్వాత మళ్లీ కాల్లాపూర్ వెళ్లిపోయాడు. ఏమీ తెలియని వాడిలాగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. శిరీష మృతదేహం మీద పడి ఏడ్చాడు.. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు శిరీష చనిపోయిందనే బాధలో ఉన్నట్టు నటించాడు. అయితే అనిల్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. ఇక ఈ కేసుకు సంబంధించి కీలక నిజాలు రాబట్టిన పరిగి డిఎస్పి కరుణ సాగర్ రెడ్డి, సీఐ వెంకటరామయ్య, ఎస్సై విఠల్ రెడ్డిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. నిందితుడిని అరెస్టు చేసి జిల్లా న్యాయవాది ఎదుట హాజరు పరిచారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The police have cracked the sirisha case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com