Portugal Airshow : ఆర్మీ హెలిక్యాప్టర్లు, విమానాలు.. ఇటీవల వరుసగా గాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. నెల క్రితం మలేషియాలో రెండు ఆర్మీ హెలిక్యాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది మంది మృతిచెందారు. తర్వాత ఇరాన్‌కు చెందిన సైనిక హెలిక్యాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం చెందాడు. తాజాగా పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో రెండు ఆర్మీ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక పైలట్ దుర్మరణం చెందాడు. మరో పైలట్ గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
పోర్చుగల్‌లోని బెజాలో ఆదివారం నిర్వహించిన ఎయిర్‌షోలో ఆరు విమానాలు విన్యాసాలు ప్రదర్శిస్తుండగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్ బేస్‌కు అవతల పడగా, మరొకటి సమీపంలో కుప్పకూలింది. విచారణ జరిపి ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటామని పోర్చుగల్ రక్షణ మంత్రి నునోమెలో తెలిపారు.
వీడియో వైరల్..
పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూపు ఈ వైమానికి విన్యాసాలను ప్రదర్శించింది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్–52 రకానికి చెందినవి. మరణించిన పైలట్ స్పెయిన్‌కు చెందిన వ్యక్తి. గాయపడిన పైలట్ పోర్చుగల్‌వాసి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ సందర్శకుడు తన కెమెరాలో బంధించాడు. దానిని ఎక్స్‌లో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది.
Beja Air Show accident DEP pic.twitter.com/4WrRfoLCeO
— Don Expensive ✞ (@kar0____) June 2, 2024