Odisha Govt Distribute Condoms: సురక్షిత శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విచ్చలవిడి సెక్స్ తో ఎన్నో అనర్థాలు వస్తాయి. సుఖవ్యాధులతో పాటు హెచ్ఐవీ లాంటివి సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే శృంగారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కొత్తగా పెళ్లయిన వారు అప్పుడే పిల్లలు వద్దనుకుంటే శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడకం తప్పనిసరి. దీంతో కండోమ్ ల వాడకం పెరిగిపోయింది. అవాంఛిత గర్భం దాల్చకుండా ఉండాలంటే మొదట వాడేది కండోమ్ లే కావడం గమనార్హం. తరువాత మాత్రలు వేసుకోవడం తెలిసిందే. దీంతో గర్భం రాకుండా ఉండాలంటే శృంగారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. దీనికి గాను ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి.

ఒడిశా ప్రభుత్వం కొత్తగా పెళ్లయిన జంటలకు ఉచితంగా కండోమ్ ప్యాకెట్లు సరఫరా చేస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా, అవాంఛిత గర్భం నిరోధించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. నూతన దంపతులకు సమస్యలు లేకుండా చేయడంలో భాగంగానే నిరోధ్ లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో జంటలకు కండోమ్ లు అందజేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహాలు ఇస్తోంది. ఏవైనా సుఖవ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి రక్షించుకునే క్రమంలో నిరోధ్ లు పనిచేస్తాయని సూచిస్తోంది.
శృంగారంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దంపతుల్లో అవగాహన కల్పించేందుకు కండోమ్ ల ను సరఫరా చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దంపతుల మధ్య ఎలాంటి శృంగార సంబంధమైన కష్టాలు రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కండోమ్ లు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు గాను ఆశ కార్యకర్తలతో వాటిని సరఫరా చేసి వారిలో అవగాహన కల్పిస్తున్నారు. సుఖ, ఇతర వ్యాధుల నుంచి ముప్పు రాకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో దంపతుల మధ్య కూడా మంచి ఆలోచన వస్తోంది. ఆశ కార్యకర్తలు ఇచ్చే కిట్ లో రెండు టవల్స్, నెయిల్ కట్టర్, అద్దం, దువ్వెన, కండోమ్స్, పిల్ లు ఉంటాయని చెబుతోంది. దీంతో దంపతులకు ఉపయోగపడే వాటిని ఇస్తూ ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం సమంజసంగానే ఉందని చెబుతున్నారు. దీంతో భవిష్యత్ లో కూడా ఈ పథకం కొనసాగించాలని ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం సక్సెస్ కావడం అక్కడి వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది.
Also Read: RBI Directs Loan Recovery Agents: వేధిస్తే వేటే.. రుణ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ వార్నింగ్!