Jharkhand: జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని పెళ్లి సమయంలో భార్యభర్తలు అగ్ని సాక్షిగా ఏడడుగులు నడుస్తారు. పెళ్లయిన తరువాత కష్ట సుఖాలను పంచుకుంటూ.. సంతోషంగా జీవించాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరి అభివృద్ధిని మరొకరు కాంక్షిస్తూ ఒకరికి ఒకరు అన్నట్లుగా సాగుతారు. కానీ కాలం మారుతున్న కొద్దీ దాంపత్య జీవితానికి విలువలేకుండా పోతుంది. దంపతుల మధ్య గౌరవం ఉండడం లేదు. భార్య భర్తల్లో ఎవరో ఒకరు తప్పుదోవ పడుతున్నారు. దీంతో ఇద్దరి జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య చేసి నిర్వాకంతో ఆ భర్త ఒక్కసారి షాక్ తిన్నాడు. తన భార్యను చదివించి, ఉద్యోగం వచ్చే విధంగా ఎంతోకష్టపడ్డాడు. అయితే చివరికి అతనిని విడిచిపెట్టి ప్రియుడితో పారిపోయిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాకు చెందిన టింకూ, ప్రియలు 2020లో పెళ్లి చేసుకున్నారు. టింకూ కూలీ పని చేస్తుంటాడు. ప్రియకు ఎప్పటి నుంచో నర్సింగ్ చేయాలన్న కోరిక ఉండేది. ఈ విషయాన్ని తన భర్త టింకూకు చెప్పింది. దీంతో ఆమెను చదివించేందుకు తన దగ్గర డబ్బలు లేవు.అయినా తన భార్యను ఎలాగైనా చదివించాలన్న ఉద్దేశంతో ఓ సంస్థ నుంచి రూ.2.5 లక్షల లోన్ తీసుకున్నాడు. తన సందపాదన లోన్ తీర్చడానికి సరిపోకపోవడంతో అదనంగా పిజ్జాలు డెలివర్లు చేశాడు. అంతేకాకుండా తన భార్యను సిటీలో హై క్లాస్ హాస్టల్ ఉంచి మరి చదివించాడు.
అయితే ప్రియా నర్సింగ్ చేస్తున్న క్రమంలో మరో వ్యక్తి దిల్ ఖుష్ ని ప్రేమించింది. వీరు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీంతో గొడ్డా నుంచి పారిపోయి ఢిల్లీలోని ఓదేవాలయంలో రహస్యంగా పెళ్లిచేసుకున్నారు తాను పెళ్లి చేసుకున్న ఫొటోలను ఇతరులమొబైల్ ద్వారా భర్త టింకూ కూమార్ కు పంపింది. దీంతో ఈ ఫొటోలను చూసిన టింకూ షాక్ కు గురయ్యాడు. తాను ఎంతో కష్టపడి చదివించిన తన భ్యార ఇతర వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై తీవ్రంగా మనో వేదన చెందుతున్నాడు.
ఈ క్రమంలో టింకూ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 19నుంచి తన భార్య కనిపించలేదని అన్నాడు. తన భార్య వేరొకరితో పెళ్లి చేసుకోవడం కంటే ప్రస్తుతం తాను అప్పుల్లో కూరుకుపోయానని పోలీసుల వద్ద వాపోయాడు. తన భార్య చదువుకోసమే రూ.2.5 లక్షలు అప్పు చేశానని చెప్పాడు. ఈ మేరకు గొడ్డా జిల్లాలోని నగర్ పోలీసులు ఘటనపై చర్యలు తీసుకుంటామని బాధితుడికి హామీ ఇచ్చారు.