Heroine: పోలీస్ రైడ్ లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్..!

ఏజెంట్, భోజపురి నటి, మోడల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Written By: Shiva, Updated On : May 14, 2023 2:28 pm
Follow us on

Heroine: చిత్ర పరిశ్రమ పైకి కనిపించేంత అందంగా ఉండదు. ఎన్నో చీకటి కోణాలు, లొసుగులు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. హీరోయిన్ చేస్తామని ఆశలు రేపి మోసం చేసే వాళ్ళు ఎందరో ఉంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. మాయమాటలు చెప్పి వాడుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. వ్యభిచారం కూడా చిత్ర పరిశ్రమలో వేళ్లూనుకుపోయిన చెడ్డ సంప్రదాయం. లగ్జరీలకు అలవాటు పడిన చిన్నా చితకా హీరోయిన్స్, ఆఫర్స్ రాని వాళ్ళు ఈ వ్యభిచార కూపంలోకి లాగబడతారు. ఒక్కోసారి వారికి ఇష్టం లేకపోయిన చేయాల్సి రావచ్చు.

పలుమార్లు వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. తాజాగా పూణేలో ఓ నటి, మోడల్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. పూణేలోని పింప్రి , చెంచేవాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా సమాచారంతో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు. పథకం పన్ని తమ వలలో చిక్కేలా చేశారు. ఓ ముఠా ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ హై లెవెల్ వ్యభిచారం నడుపుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఒక డమ్మీ విటుడిని ఏర్పాటు చేశారు. అతడు ఏజెంట్ ని ఆన్లైన్ లో సంప్రదించారు. పూణేలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయాలని విటుడిని ఏజెంట్ ఆదేశించాడు. విటుడికి ఏజెంట్ ఫోటోలు కూడా పంపాడు. నిజమైన కస్టమర్ గా నమ్మించి హోటల్ గదికి వెళ్లడం జరిగింది. అక్కడ భోజపురి నటి, ఒక మోడల్ వ్యభిచారం చేసేందుకు వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు.

ఏజెంట్, భోజపురి నటి, మోడల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చాలా కాలంగా ముఠా ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నారని సమాచారం. ఇంకా ఈ ముఠా వెనకున్న వాళ్ళను విచారణలో బయటకు లాగుతామని పోలీసులు వెల్లడించారు. పూణేలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.