Rajamouli- Kantara: ఈ ఏడాది కన్నడ లో చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం గా నిలిచింది ‘కాంతారా’..దర్శకుడిగా మరియు నటుడిగా రిషబ్ శెట్టి ఈ సినిమా ద్వారా తన విశ్వరూపం చూపించేసాడు..కంటెంట్ ఉంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని ప్రతి ఒక్కరికి మరోసారి అర్థం అయ్యేలా చేసాడు..ఒక సినిమా హిట్ అవ్వాలంటే భారీ బడ్జెట్..భారీ తారాగణం..ఇవేమి అవసరం లేదు..ఒక్క కంటెంట్ మాత్రం బలంగా ఉంటే చాలు అని చాలా మంది పాన్ ఇండియన్ దర్శకులకు కనువిప్పు కలిగించేలా చేసిన చిత్రం ఇది.

రాజమౌళి కూడా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాంతారా చిత్రం గురించి ఇదే మాట అన్నాడు..’నా లాంటి డైరెక్టర్స్ అందరూ బడ్జెట్ మరియు గ్రాండియర్ ఉంటేనే ఔట్పుట్ బాగా వస్తుంది అనుకుంటాం..కానీ నాలాంటి డైరెక్టర్స్ అందరికి కనువిప్పు కలించేలా చేసిన చిత్రం కాంతారా..15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఆ చిత్రం 400 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం అనేది మామూలు విషయం కాదు’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కాంతారా మూవీ బాక్స్ ఆఫీస్ రన్ ని నేను ఎప్పటికీ మర్చిపోను, భవిష్యత్తులో నేను కూడా ఇలా బడ్జెట్ లేకుండా బలమైన కథతో అద్భుతాలు సృష్టించే సినిమా చెయ్యడానికి ప్రయత్నం చేస్తా..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ నన్ను చాలా ఆలోచింపచేసింది..ఇక పై నేను తియ్యబోయ్యే సినిమాలకు బడ్జెట్ విషయం లో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాను’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు..ప్రపంచపట్టం లో మన తెలుగు సినిమాని నిలబెట్టిన ఘనుడు, రాజమౌళి లాంటి దర్శకుడి నోట నుండి ఇలాంటి మాటలు రావడం అంటే రిషబ్ శెట్టి ప్రతిభ ఎలాంటిదో గమనించొచ్చు.

రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అతని నుండి నేర్చుకోదగిన విశేషాలు ఉన్నాయి..అందుకే రిషబ్ శెట్టి వంటి వారు కేవలం ఒక్క ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాకూడదు..అన్ని ఇండస్ట్రీస్ లో పని చెయ్యాలి..అప్పుడే అతని కళ లోని సరికొత్త కోణాలు నేటితరం ప్రేక్షకులందరూ చూసే అదృష్టం కలుగుతుంది అంటూ విమర్శకులు తెగ పొగిడేస్తున్నారు.