CM KCR: గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు చేస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. అధికారులతో తరచూ మాట్లాడుతున్నారు. జిల్లాల్లోనూ పర్యటిస్తున్నారు. గత జూలై 11న జరిగిన ఒక సభలో “నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తాను. ముందస్తు ఎన్నికలకు వెళ్తాను.. తెలంగాణలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బిజెపి నాయకులకు ఉందా అని” ఆయన సవాల్ విసిరారు. అయితే అప్పట్లో 2018 కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అందరూ అనుకున్నారు. అదే సమయంలో టిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోయేది ఉండదని ఆయన స్పష్టం చేశారు.. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించారు.

సంకేతాలు ఇస్తున్నారా
ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోనని కేసీఆర్ చెప్పినప్పటికీ… ఆయన ఇస్తున్న సంకేతాలు వేరే విధంగా ఉన్నాయి.. అభివృద్ధి కార్యక్రమాల్లో జోరు పెంచారు.. అధికారులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు కూడా రాజకీయాలే మాట్లాడుతున్నారు. మైకు దొరికితే చాలు బిజెపి నాయకులను తూర్పార పట్టడమే పనిగా పెట్టుకున్నారు.
అందుకోసమేనా
వచ్చేయడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇదే సమయంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే కర్ణాటకలో జరిగే సమయానికే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. దీనివల్ల బిజెపి పెద్దలు మీరు పెద్దలు కర్ణాటక రాష్ట్రం మీద ఎక్కువ ఫోకస్ పెడతారని, దీనివల్ల తాను గెలవడం సులువు అవుతుందని కెసిఆర్ అనుకుంటున్నారు. సిట్టింగ్ లకు టికెట్లు ఇస్తామని చెప్పడం కూడా ఇందులో భాగమని తెలుస్తోంది.

అబద్ధం ప్రభుత్వం అంత ఈజీ కాదు
ఒకవేళ షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఎన్నికలకు వెళ్తే ఆరు నెలల పాటు ఆయన ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అంటే ఆయనకు ఎటువంటి అధికారాలు ఉండవు. మంత్రివర్గానికి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.. అయితే అప్పుడు అధికారులు ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తారా అనేది అనుమానంగానే ఉంటుంది. పైగా పాలనలో గవర్నర్ జోక్యం బాగా పెరుగుతుంది. ఇప్పుడు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ మధ్య ఉప్పు నిప్పుగా వ్యవహారం ఉన్న నేపథ్యంలో అప్పుడు పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. పైగా పలువురు మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందని, అందువల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని కెసిఆర్ తన అంతరంగికులతో చర్చించినట్టు తెలుస్తోంది.. ఒకవేళ అయితే జరిగితే రెండు పర్యాయాలు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఘనత ఆయనకు దక్కుతుంది.. అయితే గతంలో మాదిరి ఈసారి కూడా ప్రజలు ఆయనకు విజయం అందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.