Homeట్రెండింగ్ న్యూస్Goodbye 2024: ఇదేందయ్య ఇదీ.. 2024ను ఇలా సాగనంపారు.. మీ క్రియేటివిటీ తగలెయ్యా !

Goodbye 2024: ఇదేందయ్య ఇదీ.. 2024ను ఇలా సాగనంపారు.. మీ క్రియేటివిటీ తగలెయ్యా !

Goodbye 2024: కాలగమనంలో మరో ఏడాది 2024 ముగిసిపోయింది. ఈ ఏడాది చాలా మందికి మంచిని, కొందరికి విషాదం మిగిల్చింది. అయితే మంచి చెడు అన్న తేడా లేకుండా ప్రపంచమంతా 2024కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈమేరకు 2024, డిసెంబర్‌ 31న ఘనంగా వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంగలు కాగానే బైబై 2024, వెల్‌కం 2025 అంటూ నినదించారు. డ్యాన్సులు చేశారు. కేరింతలు కొట్టారు. ఇక న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హోటళ్లు, పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అనేక ఏర్పాట్లు చేశాయి. మందు విందుతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. దీంతో అంతటా సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే కొంతమంది యువకులు క్రియేటివిటీ పేరుతో, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలని 2024కు వీడ్కోలు పలికిన తీరు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

అంత్యక్రియల తరహాలో..
తెలంగు రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు.. 2024కు వీడ్కోలు పలికే వేడుకను వెరైటీగా నిర్వహించాలనుకున్నారు. అందరిలా చేస్తే గొప్పేముంటుందనుకుని.. భిన్నంగా చేయాలని, అంత్యక్రియల తరహాలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పాడెను తయారు చేసి దానికి 2024 ఫ్లెక్సీలు కట్టారు. డప్పు చప్పుళ్లతో, యువకుల ఏడుపులు, గగోగ్లుతోపాటు, నృత్యాల చేసకుంటూ సాగనంపారు. దీనిని చూసి చుట్టుపక్కలవారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఎక్స్‌లో అశోక్‌ వేములపల్లి అకౌంట్‌లో పోస్టు చేశారు. 2024ను ఇలా సాగనంపారు అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు.

సెల్పీలు, ఏడుపులు..
ఇక అంతిమయాత్రను తలపించేలా వీడ్కోలు యాత్ర సాగింది. డప్పు కొడుతూ ఓ యువకుడు ముందు సాగగా, మరో యువకుడు నిప్పు పట్టుకుని ఏడుసూత సాగడం, మరో నలుగురు పాడె మోయడం వీడియోలో కనిపిస్తుంది. నిప్పు పట్లుకున్న వ్యక్తి ఎదురు వచ్చిన వారిని పట్టుకుని ఏడుస్తూ.. వారితో సెల్ఫీలు తీసుకుంటూ ముందుకు సాగాడు. దీనిని చూసిన విద్యార్థినులు ముక్కు వేలేసుకున్నారు. ఓ పెద్దాయ.. అంతిమ యాత్రలో డ్యాన్స్‌ చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ఇలా అంతిమ వీడ్కోలు యాత్రను నిర్వహించారు.

నో కామెంట్స్‌..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఒక్కరు కూడా కామెంట్‌ చేయడం లేదు. ఇప్పటి వరకు 200 మందికిపైగా వీడియోను చూశారు. 50 మందికిపైగా లైక్‌ చేశారు. కొందరు బుక్‌మార్క్‌గా పెట్టుకున్నారు. షేర్‌ చేశారు. కానీ, కామెంట్‌ మాత్రం ఒక్కరు కూడా చేయలేదు.

సోషల్‌ మీడియా ప్రభావం..
సోషల్‌ మీడియాలో లైక్స్, షేర్స కోసం కొందరి క్రియేటివిటీ పైత్యాన్ని తలపిస్తోంది. ప్రమాదకరంగా స్కిట్‌లు, ఫీట్లు చేస్తుండగా, కొందరు ఇలా పిచ్చివేసాలు వేస్తున్నారు. కానీ, ఈ వీడియో నవ్వుకోవడానికి బాగానే ఉన్నా.. వారు ఆశించిన లైక్స్, వ్యూస్‌ రావడం లేదు. మరి ముందు ముందు ఏమైనా వ్యూస్‌ పెరుగుతాయో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular