Sree Vishnu: టాలీవుడ్ లో యంగ్ హీరో శ్రీ విష్ణు తీవ్రమైన అస్వస్థతో ఇటీవలే ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తుంది..గత కొద్దీ రోజుల నుండి డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్న శ్రీ విష్ణు ఇంట్లో నుండే చిక్కీత్స తీసుకుంటూ ఉన్నాడు..వరుసగా ఆయన చేస్తున్న రెండు మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఇందువల్ల ఆగిపోయాయి..నిన్న మొన్నటి వరుకు పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ నేడు అకస్మాత్తుగా ఆయనకీ బ్లడ్ లో ప్లేట్‌లెట్ కౌంట్ బాగా తగ్గిపోయింది..దీనితో వెంటనే ఆయన ఆసుపత్రి పాలైయ్యారు..అకస్మాతుగా శ్రీ విష్ణు కి ఇలా జరగడం చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు..టాలీవుడ్ వర్గాలు కూడా అయ్యో ఇంత యంగ్ హీరో కి అస్వస్థత ఏమిటి అని షాక్ కి గురి అయ్యారు..అయితే ప్రస్తుతం డాక్టర్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ విష్ణు పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చెప్తున్నారు..కానీ విశ్రాంతి బాగా అవసరం అని..ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడం మాములు పరిస్థితి కాదని..దీనిని తేలికగా తీసుకోలేమని చెప్తున్నారు..శ్రీ విష్ణు ప్రస్తుతం మా ఆబ్సెర్వేషన్ లోనే ఉన్నాడని..ఆయన పరిస్థితి పూర్తిగా చెక్కబడిన తర్వాతే డిశ్చార్జ్ చేస్తామంటూ డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.
ఇక శ్రీ విష్ణు ప్రస్తుతం యంగ్ హీరోలలో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు..వైవిధ్యమైన కథలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు శ్రీ విష్ణు..కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో గొప్పగా రాణించిన శ్రీ విష్ణు..హీరో గా ఎదగడానికి చాలా కష్టాలనే ఎదురుకున్నాడు..’అప్పట్లో ఒకడు ఉండేవాడు’ అనే సినిమాతో హీరో గా మారిన శ్రీ విష్ణు ఆ తర్వాత దాదాపుగా 12 సినిమాల్లో హీరోగా నటించాడు.
Also Read: Thank You movie Twitter Review: థాంక్యూ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?
వాటిల్లో ‘బ్రోచేవారెవరురా’ మరియు ఇటీవలే విడుదలైన ‘రాజ రాజ చోర’ వంటి సినిమాలు భారీ విజయం సాధించాయి..అయితే ఆ తర్వాత ఆ సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించలేకపోయాడు శ్రీ విష్ణు..ఈ సినిమాల తర్వాత ఆయన చేసిన ‘అర్జున పాల్గుణ’ మరియు ‘భళా తందనాన’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..వీటి తర్వాత ఆయన కెరీర్ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రస్తుతం మూడు బలమైన స్క్రిప్ట్స్ ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు..ఆయన తొందరగా కోలుకొని ఆరోగ్యవంతంగా మన ముందుకి వచ్చి ఎప్పటిలా తన సినిమాలతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
Also Read:Megastar Chiranjeevi: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన ఫ్లాప్ సినిమా అదేనట?