BRS Khammam Sabha: మొన్న విమానం.. నిన్న ఢిల్లీలో పార్టీ ఆఫీస్… నేడు ఖమ్మంలో ఆవిర్భావ సభ… మొత్తానికి భారత రాష్ట్ర సమితి ఫుల్ స్వింగ్ లో ఉంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు హాజరు అవుతున్న నేపథ్యంలో ఆవిర్భావ సభను కనీ విని ఎరగని స్థాయిలో నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాట్లు చేశారు.. ఖమ్మం నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపేశారు.. అడుగడుగునా హోర్డింగులు ఏర్పాటు చేశారు. కొత్త రోడ్లు నిర్మించారు. ఉన్న రోడ్లకు మరమ్మతులు చేశారు.

ఇక ఫ్లెక్సీలకు, హోర్డింగ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన 10 ఏజెన్సీలకు ఈ బాధ్యత అప్పగించారు. పలు జాతీయ మీడియా సంస్థలకు జాకెట్ యాడ్స్ కూడా ఇచ్చారు.. న్యూస్ ఛానల్ లకు ప్రైమ్ టైం యాడ్స్ ఇచ్చారు.. సో మొత్తానికి మీడియా మొత్తం గులాబీ పాట పాడాలని కెసిఆర్ ప్లాన్. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతం డ్రై సెక్షన్ లో కొనసాగుతున్న మీడియాకు ఈ యాడ్స్ ఎంతో కొంత ఉపయోగపడతాయి.. గతంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావానికి సంబంధించి నేషనల్ పేపర్లకు ఇదే స్థాయిలో యాడ్స్ ఇచ్చారు.. కానీ కవరేజ్ పేలవం. ఇప్పుడు వస్తున్న జాతీయ నాయకులు సైతం కేసీఆర్ పార్టీ పెడితే హాజరు కాలేదు. ఈ బ్యాచ్ లో ఒక్క అఖిలేష్ యాదవ్ కనిపించినట్టు గుర్తు. పైగా కెసిఆర్ చేపట్టిన రైతు ఉద్యమంలో మీరెవరు కూడా సంఘీభావం తెలుపలేదు.

ఇక ఆవిర్భావ సభకు సంబంధించి ఖర్చు మొత్తం ఖమ్మం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు భరిస్తున్నట్లు సమాచారం.. గతంలో ఈ ఇద్దరు నేతలు భారత రాష్ట్ర సమితి విమానం కొనుగోలు చేసినప్పుడు భారీ ఎత్తున డబ్బులు ఇచ్చారు.. ఇప్పుడు కూడా ఆ భారాన్ని కెసిఆర్ ఈ ఇద్దరు నేతల మీదనే వేసినట్టు తెలుస్తోంది.. అయితే ఇందులో ఒక నేతకు 2024లో ఎంపీ స్థానం ఆఫర్ చేసినట్టు సమాచారం.. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడికి ప్రభుత్వం ప్రస్తుతం నిర్మిస్తున్న ఆసుపత్రుల కాంట్రాక్టు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.. గతంలో కెసిఆర్ కు మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మేఘా పిచ్చి రెడ్డి సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు వారి మధ్య టర్మ్స్ బాగా లేకపోవడంతో… కెసిఆర్ ఆ ఇద్దరు నాయకులను ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు కానీ… ఇప్పుడైతే ఆ నాయకులకు చేతి చమురు వదులుతోంది.