
The Elephant Whisperers : 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో అందరి అంచనాలను తలకిందులు.. చేస్తూ ఓ ఇండియన్ ఏనుగు ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. మీరు చదివింది నిజమే.. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్స్ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఏడాది ఆస్కార్ అవార్డుల రేసులో ఆర్ ఆర్ ఆర్ తో పాటు ది ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిలిం విభాగంలో నామినేషన్ లో ఉన్నాయి. అయితే ఆల్ దట్ బ్రీత్ ఆస్కార్ అందుకోలేకపోయింది. కానీ ఇది ఎలిఫెంట్ విస్పర్స్ మాత్రం ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. హాలీవుడ్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల్లోని సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు..
ఇక ఇప్పటివరకు షార్ట్ ఫిలిం కేటగిరీలో నాలుగు సార్లు భారతీయ సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. 1969 లో ప్రముఖ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ ర్యాలీ బిలిమోరియా తెరకెక్కించిన ది హౌస్ దట్ ఆనంద బిల్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఎంపికైంది. ఆ తర్వాత 1979లో అండ్ ఎన్కౌంటర్ విత్ ఫేసెస్, 2019లో పీరియడ్ అండ్ ఆఫ్ సెంటెన్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో నామినేట్ అవ్వగా, పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. కాగా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పర్స్ ఈ రెండు చిత్రాలకు గునిత్ మొంగా నిర్మాతగా వ్యవహరించారు. ఆమెకు ఇది రెండవ ఆస్కార్ అవార్డు. ఇప్పుడు ది ఎలిఫెంట్ విస్పరర్ షార్ట్ ఫిలిం కు ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఒక వయసు మల్లిన జంట ఓ అనాధ ఏనుగు పిల్లను పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతి తో అనుబంధం, ఏనుగు పిల్ల చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్ల, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించి ఈ కథ సాగుతుంది. ఇప్పటికే అనేక అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా… ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఈ సినిమాకి కార్తీక్ గోన్సాల్వెస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
#RRRMovie composer M. M. Keeravani accepts the original song #Oscar for “Naatu Naatu” and graces the audience with a tune of his own. https://t.co/hxuR41IpLt pic.twitter.com/t4pbTwAE1M
— Los Angeles Times (@latimes) March 13, 2023