Himba Culture: సండే.. సెలవు వచ్చిందంటే.. నిద్ర లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంది. లేచినా.. రోజువారీ పనులు చేయడానికి ఇష్టపడరు చాలా మంది. ముఖ్యంగా స్నానానికి దూరంగా ఉండడం చూస్తుంటాం. అయితే ఈ తెగ వారు మాత్రం నీళ్లతో స్నానం చేయరు.. ఈ తెగవారు ఇతర తెగల కంటే పూర్తి భిన్నం. వీళ్లు స్వయం సమృద్ధి కలిగినవారే. అందులో ఎక్కువ మంది పశువుల పెంపకందారులు. కానీ, వీరికి ఓ వింత ఆచారం ఉంది. ముఖ్యంగా ఈ తెగవారు ఇంటికి వచ్చిన అతిథులకు, అపరిచితులకు భర్తలు తమ భార్యలను అప్పగించే ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో మరికొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నేడు ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. మర మనుషులు, ఆర్టిఫీషియరల్ ఇంటలిజెన్స్‌తో అన్ని పనులు సులభం అవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవంతో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఎత్తయిన భవనాలే కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.. మరోవైపు రాతియుగంలో మానవులు జీవించిన విధంగానే ఇప్పటికీ అనేక తెగలు పాటిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన తెగల ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఒకవైపు ఆశ్చర్యంగానూ, ఇంకోవైపు బాధగానూ అనిపిస్తాయి. ఈ తెగల నియమాలు, నిబంధనలు ఇంకా పాతవి. చాలామంది వీరి అలవాట్లను చూసి నోరెళ్లబెడుతున్నారు. కానీ, ఈ తెగలు తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారనేది వాస్తవం.
ఆశ్చర్యంగా హింబా తెగ ఆచార వ్యవహరాలు
నమీబియాలోని హింబా తెగ ఆచార వ్యవహారాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నేడు ఈ తెగలో 50 వేల మందికిపైగా ఉన్నారు. కానీ నేటికీ ఈ తెగలకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ తెగలో స్నానం చేయడం కచ్చితంగా నిషేధించబడింది. ప్రపంచ పురోగతి వారిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ తెగలలో ఇంటి ఆడవాళ్లతోపాటు బయటి నుంచి వచ్చిన అతిథులకు భోజనం వడ్డిస్తారు.
ఎందుకంటే హింబా గిరిజన ప్రజలు సొంత నియమాలు, నిబంధనలను కలిగి ఉన్నారు.
రోజంతా పని..
హింబా తెగవారు గిరిజనుల మాదిరిగానే రోజంతా ఆహారం కోసం పనిచేస్తారు. కానీ, ఈ తెగలో స్నానం చేయడం నిషిద్ధం. నీళ్లలో స్నానం చేయకుండా పొగతో స్నానం చేస్తారు. దీనినే పొగ స్నానం అంటారు. పొగతో స్నానం చేసేటప్పుడు సేన్టేడ్ రెసిన్‌లు (పరిమళ ద్రవ్యాలను), వెన్న పొగలో కలిపి స్నానం చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులు. నీటి లభ్యత. ఈ స్నానం వారి నమ్మకాల ప్రకారం కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
అతిథులకు భార్యలను అప్పగించే ఆచారం..
ఇది కాకుండా ఈ తెగలకు ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. భార్యాభర్తలు ఇంటికి వచ్చిన అతిథులకు సత్కారం చేస్తారు. భోజన సత్కారాలతోపాటు అతనితో భార్య శృంగారం చేయాల్సి ఉంటుంది. దీనికి భర్త సమ్మతి కూడా కచ్చితంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల బంధంలో అసూయ భావం తొలగిపోతుందని గిరిజనులు నమ్మకం. ఇందుకోసం వారి ఇంట్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఒకే గది ఉంటే భర్త అరుబయట పడుకుంటాడు.
ముకురు వీళ్ల దేవుడు..
ఈ తెగవారు ముకురు అనే నమీబియా దేవుడిని నమ్ముతారు. వారి నమ్మకాల ప్రకారం వారి తెగకు చెందిన మరణించినవారు మరణం తర్వాత దేవుని దూతలుగా మారతారు. జీవించి ఉన్నవారికి, దేవుడికి మధ్య కమ్యూనికేషన్ లింక్‌గా మారతారు అని నమ్ముతారు. ఎంతో అభివృద్ధి చెందామని మనం చెప్పుకుంటున్నా.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వింత జనాలు ఇప్పటికీ ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు.